సరదాగా సాగరతీరాన.. మంచు ఫ్యామిలీ రచ్చ
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ మాల్దీవుల్లో రచ్చ చేస్తోంది. మంచు లక్ష్మీ తన భర్త, పాప.. మోహన్ బాబు, తన సతీమణితో కలిసి వెళ్లారు. ఇలా మంచు ఫ్యామిలీ ఇప్పుడు మాల్దీవుల్లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మాల్దీవుల్లో సందడి చేసిన తారల లిస్ట్ చాలా పెద్దగానేఉంది. అందులో ఇప్పుడు మంచు ఫ్యామిలీ కూడా చేరింది. నిన్న బయల్దేరిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక తారలందరూ వెకేషన్ కోసం బాగానే ఎదురు చూసినట్టున్నారు. అయితే అలా అందరూ కూడా ఒకే చోటను ఎంచుకున్నారు. పెళ్లి చేసుకున్న కొత్త జంటలు హనీమూన్ వేదికగా మాల్దీవులనే ఎంచుకున్నారు. లాక్డౌన్‌లో నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్‌ను ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల బీచ్‌ల్లో తిరుగుతూ తీర్చేసుకున్నారు.రకుల్ ప్రీత్,తాప్సీ, ప్రణీత వంటి వారందరూ మాల్దీవులను చుట్టి వచ్చేశారు.

ఇక కాజల్ గౌతమ్, నిహారిక చైతన్యలు కూడా తమ హనీమూన్‌ను అక్కడే సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ కూడా అక్కడే సందడి చేస్తున్నారు. కరోనా, లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లకుండా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు అలా మోహన్ బాబు మాల్దీవుల బీచ్‌లో మనవరాలితో కలిసి ఆడుకుంటున్నారు. అలా చల్లని వేళ సాగర తీరాన భార్యతో ముచ్చట్లు పెడుతున్నాడు. మంచు లక్ష్మీ సైతం తన ఫ్యామిలీతో కలిసి రచ్చ చేస్తోంది.



Click it and Unblock the Notifications











