For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పులు చేయండి కానీ.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్

    |

    మంచు లక్ష్మీ సాధారణంగా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. కూతురితో కలిసి మరి వర్కవుట్లు చేస్తుంటుంది. యోగాసానాలు వేయడంలోనూ మంచు లక్ష్మీ నిష్ణాతురాలు. అలా నిత్యం ఉదయం పూట మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి వర్కవుట్లు చేస్తుంటుంది. అయితే తాజాగా మంచు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఏకంగా తన కాళ్లను తన తలపైకి తీసుకొచ్చేసింది.

    వాటి గురించి చెబుతూ మంచు లక్ష్మీ ఓ పోస్ట్ చేసింది. ట్యూస్ డే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ ఓ మోటివేషనల్ మాటలు చెప్పింది. ఇందులో భాగంగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఏదైతే మనల్ని బ్రేక్ చేయలేదో.. అదే మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. ప్రతీ రోజు నీ హద్దుల్ని చెరిపి ముందుకువెళ్లడంలో ఏ మాత్రం భయపడవద్దంటూ అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.

    Manchu Lakshmi About Tuesday Motivation

    ఇంకా మంచు లక్ష్మీ చెబుతూ.. మీకు మీరే తప్పులు చేసేందుకు అవకాశం ఇవ్వండి. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుని.. మీది మీరు నిలబడేందుకు వాటిని ఉపయోగించుకోండి.. మీ మీద మీరే ఫోకస్ పెట్టుకోవాలి.. మీకు ఏది నిజమని అనిపిస్తే దాన్నే ఆచరించండి.. అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక మంచు లక్ష్మీ తాజాగా పిట్ట కథలు సినిమాలో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఓ పాత్రను పోషించింది.

    English summary
    Manchu Lakshmi About Tuesday Motivation,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X