అందుకే హోలీని ఇలా ట్రై చేశా.. రకుల్ ప్రీత్‌తో మంచు లక్ష్మీ రచ్చ
ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా తాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ మొదలైందని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసేశాయి. అయినా కొందరు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు, భౌతిక దూరం వంటి వాటి గురించి ఆలోచించడం లేదు. నేటి హోలీ పండుగ నాడు కూడా కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. కానీ మంచు లక్ష్మీ మాత్రం తన ఆలోచనలు, ప్లానింగ్‌ను మార్చుకుంది.

మంచు ఫ్యామిలీ..
మామూలుగా గత వారం మంచు ఫ్యామిలీ ఓ రేంజ్‌లో సెలెబ్రేషన్స్ చేసుకుంది. మోహన్ బాబు బర్త్ డే అంటూ విద్యానికేతన్‌లో హల్చల్ చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అంతా సందడి సందడిగా వేడుకలను నిర్వహించారు. కానీ ఈ హోలీని మాత్రం మంచు లక్ష్మీ వెరైటీగాప్లాన్ చేసింది.

రకుల్ ప్రీత్‌తో కలిసి..
మంచు లక్ష్మీకి ఇండస్ట్రీలో అందరూ స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్లతో మంచు లక్ష్మీ క్లోజ్‌గా ఉంటుంది. రకుల్ ప్రీత్, రెజీనా, తాప్సీ వంటి వారు మంచు లక్ష్మీకి చాలా క్లోజ్. అందులోనూ రకుల్ ప్రీత్‌తో మంచు లక్ష్మీ మరింత సన్నిహితంగా ఉంటారు.
బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

రకుల్‌తో హోలీ..
ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తూ ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ మన పక్కనే ఉన్నంత వరకు ఎంతో సరదాగా ఉంటుంది.. కాలం సంతోషంగా గడుస్తుంది.. నా చుట్టూ ఉండే వాళ్లు నాకెంతో ఇష్టం.. వారితో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతాను అని రకుల్‌తో హోలీని ఎలా సెలెబ్రేట్ చేసుకుందో మంచు లక్ష్మీ వివరించింది.

కరోనా కారణంగా..
మామూలుగా అయితే ఈ ఏడాది హోలీని వెరైటీగా ప్లాన్ చేశాం. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కొత్త ప్రయత్నించాం. స్నేహితులందరం కలిసి నాలుగు గంటల మార్నింగ్ ట్రెక్‌కు వెళ్లాం. అటు నుంచి నిండు చంద్రుడిని చూసేందుకు కాయకింగ్‌కు వెళ్లామని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











