Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రతీ పాఠం ఓ ఆశీర్వాదం.. మోహన్ బాబుపై మంచు లక్ష్మీ ఎమోషనల్
మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే కామన్ డీపి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహన్ బాబు బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు మంచు లక్ష్మీ తిరుపతికి వెళ్లింది. విద్యానికేతన్‌లో మోహన్ బాబు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంచు లక్ష్మీ తన తండ్రిపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
'నా జీవితంలో నాకు దొరికిన అదృష్టం మా నాన్న. ఆయన్ను ఎంతలా ఆరాధిస్తానో చెప్పేందుకు మాటలు కూడా చాలవు.. నాన్న నువ్వే నా బలం, నువ్వే నాకు స్పూర్తి. నా ప్రాణం నువ్వే. నేను ఇంతలా ఎదిగానంటే.. దానికి కారణం నువ్వే. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు. నువ్ కురిపించే ప్రేమకు, చూపించే ఆప్యాయతకు థ్యాంక్స్ నాన్న. నువ్ నేర్పించే ప్రతీ పాఠం కూడా ఓ ఆశీర్వాదమే.
నువ్ మా కోసం చేసే ప్రతీ పని, నీ చుట్టూ ఉండేవారి కోసం చేసే ఆలోచనలు అన్నీ కూడా ఎంతో నిష్కల్మషంగా ఉంటాయి. నేను జీవితంలో ప్రతీ క్షణం నీలా మారేందుకు, జీవించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కూతురు కూడా నీ అడుగుజాడల్లోనే పెరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు మనస్పూర్తిగా ఇష్టం నాన్న. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.