twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీ పాఠం ఓ ఆశీర్వాదం.. మోహన్ బాబుపై మంచు లక్ష్మీ ఎమోషనల్

    |

    మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే కామన్ డీపి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహన్ బాబు బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు మంచు లక్ష్మీ తిరుపతికి వెళ్లింది. విద్యానికేతన్‌లో మోహన్ బాబు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంచు లక్ష్మీ తన తండ్రిపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

    'నా జీవితంలో నాకు దొరికిన అదృష్టం మా నాన్న. ఆయన్ను ఎంతలా ఆరాధిస్తానో చెప్పేందుకు మాటలు కూడా చాలవు.. నాన్న నువ్వే నా బలం, నువ్వే నాకు స్పూర్తి. నా ప్రాణం నువ్వే. నేను ఇంతలా ఎదిగానంటే.. దానికి కారణం నువ్వే. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు. నువ్ కురిపించే ప్రేమకు, చూపించే ఆప్యాయతకు థ్యాంక్స్ నాన్న. నువ్ నేర్పించే ప్రతీ పాఠం కూడా ఓ ఆశీర్వాదమే.

    Manchu Lakshmi Emotional On Mohan babu Birthday

    నువ్ మా కోసం చేసే ప్రతీ పని, నీ చుట్టూ ఉండేవారి కోసం చేసే ఆలోచనలు అన్నీ కూడా ఎంతో నిష్కల్మషంగా ఉంటాయి. నేను జీవితంలో ప్రతీ క్షణం నీలా మారేందుకు, జీవించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కూతురు కూడా నీ అడుగుజాడల్లోనే పెరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు మనస్పూర్తిగా ఇష్టం నాన్న. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Manchu Lakshmi Emotional On Mohan babu Birthday,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X