Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోకు పెళ్లి అయిందని తెగ ఏడ్చేశాను.. అసలు సంగతి చెప్పిన మంచు లక్ష్మీ
టాలీవుడ్లో మంచు లక్ష్మీ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తెరపై మంచు లక్ష్మీ చేసే సందడి కంటే.. సోషల్ మీడియాలో చేసే హల్చల్ ఎక్కువగా ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీ కొత్తగా కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది కొత్త ఆరంభం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కూతురితో కలిసి కొత్త కార్యాలయంలోకి కుడికాలు పెట్టింది. ఈ మేరకు మంచు లక్ష్మీ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
ఎన్నో కథలు..
ఇదే నా కొత్త ఆరంభం.. నేను ఎన్నో కొత్త కథలు మీకు చెప్పబోతోన్నాను.. ఈ రోజు నా బేబీతో కలిసి కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టాను.. నేను ఈ సమయంలో కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. ఎంతో సంతోషంగా ఉన్నాను.. నేను రాబోయే మరిన్ని మంచి విషయాల కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి.. మీ ప్రేమను పంచండి అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.
సపరేట్ ప్లాన్స్..
మంచు లక్ష్మీ కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్టు తెలుస్తోంది. అప్పట్లో వూట్ యాప్ కోసం మంచు లక్ష్మీ చేసిన టాక్ షో తెగ వైరల్ అయింది. తాజాగా తన కొత్త కార్యాలయాన్ని కూడా అందుకు అడ్డాగా మార్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
తాజాగా అలా..
మంచు లక్ష్మీ తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తాప్సీ, ఆమిర్ ఖాన్, నాగార్జునల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఇది వరకే ఎన్నో ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మీదున్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఆమిర్ ఖాన్ మీదున్న ప్రేమను బయటపెట్టేసింది.
Recommended Video
ఏడ్చేశాను..
ఆమిర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడని తెలిశాక ఏడ్చేశానని, రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని మంచు లక్ష్మీ తెలిపింది. ఆమిర్ ఖాన్ చేసే సినిమాలు.. సినిమాను ఎంపిక చేసుకునే విధానం, ఆయన నటనా అన్నీ ఇష్టమని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఆమిర్ ఖాన్‌తో పాటు నాగార్జున అంటే కూడా ఇష్టమని పేర్కొంది.