Manchu Lakshmi: రెడ్ హాట్ లుక్‌లో మంచు లక్ష్మీ.. టాప్ విప్పేసి మరి ఓపెన్ షో
తెలుగు ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. బాలనటిగా సినిమాలు చేసిన ఈ మంచువారి అమ్మాయి మొదట్లో హాలీవుడ్ సినిమాల్లో నటించి అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో సినిమాలు చేసి నటనలో తానేంటో నిరూపించుకుంది. ఇక సినిమాలు కాకుండా సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
తొలి తెలుగు అమ్మాయి : విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన మంచు లక్ష్మి అక్కడ నటిగా శిక్షణ తీసుకుని ఇంగ్లీష్ సినిమాలు చేసింది. 2008లో హాలీవుడ్ మూవీ ది ఒడేతో సినిమా రంగంలో ఎంటర్ అయింది మంచు లక్ష్మి. ఇందులో నజ్మా పాత్రలో మెప్పించిన ఈ మంచువారి అమ్మాయి తర్వాత 2009లో డెడ్ ఎయిర్ అనే సినిమా చేసింది. ఇలా హాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన తొలి తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి.

ఇంపాక్ట్ చేసేలా : హాలీవుడ్ సినిమాల్లో మెప్పించిన మంచు లక్ష్మి తర్వాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 2001లో సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం కాకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అది కూడా ఎంతలా అంటే బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మంచు లక్ష్మిని తీసుకునేలా ఇంపాక్ట్ చేసింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పాత్రను రెజెక్ట్ చేసింది లక్ష్మి.

హిందీలో కూడా : అనగనగా ఒక ధీరుడు సినిమా తర్వాత మంచు లక్ష్మి అనేక సినిమాలు చేసింది. దొంగల ముఠా, దొంగాట, చందమామ కథలు, ఉ కొడతారా.. ఉలిక్కి పడతారా, కడలి, గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా డిపార్ట్ మెంట్ అనే హిందీ సినిమా సైతం చేసింది మంచు లక్ష్మి.

అవార్డ్స్ : అనగనగా ఒక ధీరుడు మూవీలో విలన్ పాత్రకు ఉత్తమ ప్రతినాయకురాలిగా నంది పురస్కారం, సైమా అవార్డ్ దక్కించుకుంది మంచు లక్ష్మి. ఇదే కాకుండా దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డ్, స్పెషల్ జ్యూరి అవార్డ్ కైవసం చేసుకుంది. చందమామ కథలుకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.

నిర్మాతగా :గుండెల్లో గోదారి సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా సైమా అవార్డ్ సొంతం చేసుకుంది మంచు లక్ష్మి. ఇలా కేవలం నటిగానే కాకుండా సరికొత్తగా బ్యానర్ స్థాపించి కొన్ని సినిమాలను కూడా నిర్మించింది. అలాగే తన సోదరులతో కూడా ఆమె సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. అయితే నిర్మాతగా మాత్రం మంచు లక్ష్మికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాలేదు.
రెడ్ హాట్ లుక్ : ఇదిలా ఉంటే నాలుగుపదుల వయసు దాటి.. ఒక బిడ్డకు తల్లి అయినా మంచు లక్ష్మి తన అందంతో కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా రెడ్ కలర్ టాప్ విప్పేసి మరి బ్రాలో తన ఎద, నడుము అందాలను ఓపెన్ గా చూపించింది. ఇందులో రెడ్ హాట్ లుక్ లో ఘాటు స్టిల్ తో అట్రాక్ట్ చేసింది. ఎన్నడూ చూడని విధంగా హాట్ షో చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











