twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నో ఆశలతో కుడి కాలు పెట్టిన మంచు లక్ష్మీ.. ఇది కొత్త ఆరంభమంటూ ఎమోషనల్ పోస్ట్

    |

    మంచు లక్ష్మీ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మంచు లక్ష్మీ అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై అందర్నీ మెప్పించింది. బుల్లితెరపై హోస్ట్‌గా పలు రకాల షోలను నిర్వహించింది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేసి అందులో సెలెబ్రిటీలను భాగస్వామ్యం చేసింది. ఇదంతా ఒకెత్తు అయితే మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఒకెత్తు. మంచు లక్ష్మీపై వచ్చే ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతాయి.

    సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    వెండితెరపై మంచి పాత్రలు వేసిన మంచు లక్ష్మీ.. బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ అలరించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మీని నెటిజన్లు ఆడేసుకుంటారు. మంచు లక్ష్మీ భాష, యాసను ట్రోల్ చేస్తుంటారు. వాటిని మంచు లక్ష్మీ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ స్పోర్టీవ్‌గా తీసుకుంటారు.

    ఆ మధ్య కొన్ని పదాలు..

    ఆ మధ్య కొన్ని పదాలు..

    మంచు లక్ష్మీ ఆ మధ్య కొన్ని పదాలను కొత్తగా కనిపెట్టింది. ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ నిలదీస్‌ఫై అంటూ నోరు జారింది. ఆ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మళ్లీ కరోనా గురించి చెబుతూ అందులో ఆర్ కింద పడి దొర్లాలి అంటూ చెప్పిన వీడియో ఫుల్ వైరల్ అయింది.

    లాక్డౌన్‌లో రచ్చ..

    లాక్డౌన్‌లో రచ్చ..

    లాక్డౌన్‌లో మంచు లక్ష్మీ.. తన కూతురు నిర్వాణతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యోగాలు, జిమ్‌లు అంటూ తల్లీ కూతుళ్లిద్దరూ హల్చల్ చేశారు. యూట్యూబ్‌లో చానెల్ పెట్టి వీడియోలతో వైరల్ అవుతున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.

    కొత్త ఆరంభం..

    కొత్త ఆరంభం..

    తాజాగా మంచు లక్ష్మీ తన కొత్త కార్యాలయాన్ని ప్రారంబించింది. అందులోకి కూతురితో కలిసి కుడి కాలు ముందు పెట్టింది. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్అయింది. ఇది కొత్త ఆరంభం.. మీ ప్రేమ ఆశీర్వాదం కావాలంటూ మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

    Recommended Video

    Actor Ananda Chakrapani Interview Part 3
    ఎన్నో కథలు..

    ఎన్నో కథలు..

    మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ సారాంశం ఏంటంటే.. ఇదే నా కొత్త ఆరంభం.. నేను ఎన్నో కొత్త కథలు మీకు చెప్పబోతోన్నాను.. ఈ రోజు నా బేబీతో కలిసి కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టాను.. నేను ఈ సమయంలో కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. ఎంతో సంతోషంగా ఉన్నాను.. నేను రాబోయే మరిన్ని మంచి విషయాల కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి.. మీ ప్రేమను పంచండి అని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Manchu Lakshmi Started New Office, Here's to New Beginnings & Beautiful Stories I'm about to tell! Today, I set foot in my new office with my baby. It has been a while since I took such a big plunge, I'm both nervous and extremely excited for this new opportunity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X