Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్నో ఆశలతో కుడి కాలు పెట్టిన మంచు లక్ష్మీ.. ఇది కొత్త ఆరంభమంటూ ఎమోషనల్ పోస్ట్
మంచు లక్ష్మీ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మంచు లక్ష్మీ అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై అందర్నీ మెప్పించింది. బుల్లితెరపై హోస్ట్‌గా పలు రకాల షోలను నిర్వహించింది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేసి అందులో సెలెబ్రిటీలను భాగస్వామ్యం చేసింది. ఇదంతా ఒకెత్తు అయితే మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఒకెత్తు. మంచు లక్ష్మీపై వచ్చే ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతాయి.
సోషల్ మీడియాలో అలా..
వెండితెరపై మంచి పాత్రలు వేసిన మంచు లక్ష్మీ.. బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ అలరించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మీని నెటిజన్లు ఆడేసుకుంటారు. మంచు లక్ష్మీ భాష, యాసను ట్రోల్ చేస్తుంటారు. వాటిని మంచు లక్ష్మీ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ స్పోర్టీవ్‌గా తీసుకుంటారు.
ఆ మధ్య కొన్ని పదాలు..
మంచు లక్ష్మీ ఆ మధ్య కొన్ని పదాలను కొత్తగా కనిపెట్టింది. ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ నిలదీస్ఫై అంటూ నోరు జారింది. ఆ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మళ్లీ కరోనా గురించి చెబుతూ అందులో ఆర్ కింద పడి దొర్లాలి అంటూ చెప్పిన వీడియో ఫుల్ వైరల్ అయింది.
లాక్డౌన్లో రచ్చ..
లాక్డౌన్లో మంచు లక్ష్మీ.. తన కూతురు నిర్వాణతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యోగాలు, జిమ్‌లు అంటూ తల్లీ కూతుళ్లిద్దరూ హల్చల్ చేశారు. యూట్యూబ్‌లో చానెల్ పెట్టి వీడియోలతో వైరల్ అవుతున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
కొత్త ఆరంభం..
తాజాగా మంచు లక్ష్మీ తన కొత్త కార్యాలయాన్ని ప్రారంబించింది. అందులోకి కూతురితో కలిసి కుడి కాలు ముందు పెట్టింది. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్అయింది. ఇది కొత్త ఆరంభం.. మీ ప్రేమ ఆశీర్వాదం కావాలంటూ మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Recommended Video
ఎన్నో కథలు..
మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ సారాంశం ఏంటంటే.. ఇదే నా కొత్త ఆరంభం.. నేను ఎన్నో కొత్త కథలు మీకు చెప్పబోతోన్నాను.. ఈ రోజు నా బేబీతో కలిసి కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టాను.. నేను ఈ సమయంలో కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. ఎంతో సంతోషంగా ఉన్నాను.. నేను రాబోయే మరిన్ని మంచి విషయాల కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి.. మీ ప్రేమను పంచండి అని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్టు తెలుస్తోంది.