మోహన్ బాబు బర్త్ డే.. తిరుపతిలో మంచు ఫ్యామిలీ రచ్చ
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మంచు వారింట పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రేపటి (మార్చి 19) బర్త్ డే సందర్భంగా మంచు కుటుంబం తిరుపతికి బయల్దేరింది. మామూలుగా పండుగలకు మోహన్ బాబు ఫ్యామిలీ సొంతూరైన తిరుపతికే వెళ్తుంటుంది. అక్కడే తమ విద్యా సంస్థలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణతో కలిసి తిరుపతికి వెళ్లింది.
ఫ్లైట్‌లో తిరుపతికి బయల్దేరింది మంచు లక్ష్మీ. తండ్రి, కూతురితో కలిసి మంచు లక్ష్మీ తిరుపతికి వెళ్లింది. కోవిడ్ నిబంధనల మూలాన ఫేస్ షీల్డ్, మాస్క్ అన్నీ ధరించి నియమాలను పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుని వెళ్లారు. ఈక్రమంలో మంచు లక్ష్మీ షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తిరుపతిలో తనకు ఇష్టమైన ఫుడ్ గురించి కూడా చెప్పింది మంచు లక్ష్మీ.

ఇక రేపు అంతా పండగ వాతావరణం ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు మోసగాళ్లు సినిమాతో మంచు విష్ణు తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. మరో వైపు మోహన్ బాబు బర్త్ డేతో మంచు వారింట్లో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే రేపు మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా సన్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











