twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దెబ్బకు ట్వీట్ డిలీట్.. ఆ టీవీ యాజమాన్యానికి మంచు మనోజ్ పంచ్‌

    |

    మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ట్రోలింగ్‌ను సైతం ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. తనపై, ఫ్యామిలీపై వచ్చే ట్రోల్స్, మీమ్స్‌ను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. మంచు లక్ష్మీ వెరైటీ యాస, డైలాగ్స్, మోహన్ బాబు ఫసక్ డైలాగ్ ఆ మధ్య ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వీటిని కూడా తన ట్వీట్‌లో వాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

    ఇక సోషల్ మీడియా ద్వారా సేవ చేయడంలోనూ ముందుంటాడు. ఎవరికైనా ఏదైనా సాయం కావాలని అడిగితే చేతనైంత చేస్తాడు. ముఖ్యంగా అభిమానులను మాత్రం ఎంతో బాగా చూసుకుంటాడు. సామాజిక సమస్యలపైనా స్పందిస్తూ న్యాయం కోసం నిలబడతాడు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించినప్పుడు మంచు మనోజ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. తాజాగా ఓ టీవీ చానెల్ ట్వీట్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు.

    Manchu Manoj Satires On Gemini Tv About Denikaina Ready

    ఈ మధ్య ప్రతీ టీవీ యాజమాన్యం తమకంటూ సోషల్ మీడియాలో అధికారిక ఖాతాలను క్రియేట్ చేసుకున్నాయి. తమ టీవీల్లో వచ్చే ప్రోగ్రాంలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నాయి. అలా జెమినీ టీవీలో దేనికైనా రెడీ చిత్రం వస్తోండగా.. దానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. అయితే ఆ ప్రశ్న అయితే అడిగారు..గానీ అది రైటో రాంగో చూసుకోలేదు. దేనికైనా రెడీ సినిమాలో హీరో మంచు విష్ణు అయితే మనోజ్ పాత్ర పేరు ఏమిటి? అని అడిగారు. ఈ ట్వీట్ చూసిన మంచు మనోజ్ అదిరిపోయే పంచ్ వేశాడు. నేను దేనికైనా రెడీయే కానీ ఆ సినిమాలో నేను లేను అంటూ సెటైర్ వేశాడు. దీంతో తప్పు తెలుసుకున్న జెమిని టీవీ ట్విట్టర్ వారు తమ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

    English summary
    Manchu Manoj Satires On Gemini Tv About Denikaina Ready, Gemini Tv Did Mistake That Manchu Manoj In Denikaina Ready,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X