For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాలయ్య కూతురు చేసిన పనికి మంచు మనోజ్ ఫిదా, ఈ కుక్క ఫోటో ఏమిటో?

  |

  తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. తుఫాన్ ప్రభావంతో అనేక గ్రామాలు నాశనం అయ్యాయి. అక్కడి ప్రజలను ఆదుకోవడంతో పాటు గ్రామాలను పూర్వస్థితికి తేవడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు, పలువురు ప్రముఖులు విరాళాల రూపంలో తమవంతు సహాయం అందిస్తున్నారు.

  ఏం చేయబోతున్నానో 15 రోజుల్లో చెబుతా: మంచు మనోజ్

  కాగా... బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి తిత్లి తుపాన్ బాధితులను ఆదుకోవడానికి అక్కడి ప్రాంతాలను పూర్వస్థితికి తేవడంలో భాగంగా తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. 10 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. బ్రాహ్మణి చేసిన ఈ పని నటుడు మంచు మనోజ్‌ను ఎంతగానో మెప్పించింది.

  లయన్ కూతురు ఎప్పటికీ లయనే అంటూ మనోజ్ ట్వీట్

  ‘‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో ఆమె ఒకరు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడటం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. లయన్ కూతురు ఎప్పటికీ లయనే. జై బాలయ్య'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

  ఈ కుక్క ఫోటో ఏమిటో?

  మంచు మనోజ్ తాత్కాలికంగా హైదరాబాద్ నుంచి తిరుపతి షిప్టయిన సంగతి తెలిసిందే. రాయలసీమ యువతకు సేవ చేసేందుకు ఆయన ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరో పది రోజుల్లో తన కార్యచరణ ఏమిటనేది ప్రకటించనున్నారు. కాగా... బుధవారం ఉదయం మనోజ్ తన ట్విట్టర్లో ఓ కుక్క ఫోటో పోస్టు చేసి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం చర్చనీయాంశం అయింది.

  మనోజ్ ఆలోచన మొత్తం ప్రజా సేవ గురించే

  తిరుపతి వెళ్లిన దగ్గర నుంచి మంచు మనోజ్ ఆలోచన అంతా ప్రజల గురించి, వారికి సేవ చేస్తూ ఎలా ముందుకు సాగాలి అనే విషయం చుట్టూ తిరుగుతుందని స్పష్టం అవుతోంది. తెలుగు భాష అమెరికాలో వేగంగా విస్తరిస్తోందనే ఓ వార్త ఆయన కంట పడటంతో వెంటనే అభిమానులతో పంచుకున్నారు.

  మీకోసం నేను...

  నా జీవితాన్ని ఎక్కువగా సేవా మార్గం వైపు నడిపించాలనుకుంటున్నాను. తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచం అంతా విస్తరించేలా చేస్తానంటూ ఇటీవల మంచు మనోజ్ ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  English summary
  "Truly inspiring to see dng her bit for #Srikakulam!To one of the Strong Women I know :)💪🏽A great move indeed brahmaninara 👍👍 It’s really nice to see ppl stand up for doing good for the needy. 🙏 Lions daughter wil always be Lioness :)Jaiiii Ballaya💪🏽 #WomenPower #TitliCyclone." Manchu Manoj tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more