twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదో తరగతికి బోర్డ్ పరీక్షలు అవసరమా?.. పూర్తిగా ఎత్తేయాలన్న మంచు విష్ణుపై నెటిజన్స్ ఫైర్

    |

    కరోనా వైరస్ ప్రపంచాన్ని, మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నాటి నుంచి మానవుడి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మానవుని కారణంగా ఇంత కాలం కాలుష్యానికి గురైన వాతావరణం సాధారణ స్థితిలోకి వచ్చింది. మనిషి వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇవే కాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

    కరోనా దెబ్బకు..

    కరోనా దెబ్బకు..

    కరోనా దెబ్బకు దేశంలో విద్యా వ్యవస్థ రూపు రేఖలే మారిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రకాల పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. బేషరతుగా విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించాల్సి వచ్చింది. ఇది కొందరికీ ఆనంద దాయకమే అయినా కొందరు మాత్రం నిరుత్సాపడ్డారు.

    అన్నీ రద్దు..

    అన్నీ రద్దు..

    పదో తరగతి, ఇంటర్ ఇలా అన్ని రకాల బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు అయ్యాయి. వివిద రకాల ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా విజృంభణ ఇలాగే ఈసారి విద్యా సంవత్సరం కూడా అనుమానస్పదంగానే మారుతుంది. అయితే ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు మొదలెట్టాయి. వీటిపైనా భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

    బోర్డ్ పరీక్షలు అవసరమా..

    బోర్డ్ పరీక్షలు అవసరమా..

    ఆ మధ్య ఆన్ లైన్ క్లాసులపై మంచు లక్ష్మీ, డైరెక్టర్ క్రిష్ మధ్య మాటలయుద్దం జరిగిని సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు బోర్డ్ పరీక్షలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘ఈ ఏడాదే కాకుండా పదో తరగతి బోర్డ్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏంటి?' అని మంచు విష్ణు ప్రశ్నించాడు.

    Recommended Video

    #DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
    నెటిజన్స్ ఫైర్..

    నెటిజన్స్ ఫైర్..

    మంచు విష్ణు చేసిన ఈ కామెంట్లకు వారి విద్యా సంస్థ విద్యానికేతన్‌కు ముడిపెట్టి ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. అది సరైన వాదన కాదని ఫైర్ అవుతున్నారు. ఎగ్జామ్స్ అన్ని పీకేద్దాం... విద్యార్థులందర్నీ మీ విద్యానికేతన్‌లో చెత్త ఊడ్చటానికి పెట్టేసుకుందామని కామెంట్స్ చేస్తున్నారు. వారు ఆ వయసులోనే టిక్ టాక్ అంటూ ఏ రేంజ్‌లో రెచ్చి పోతున్నారో తెలీదా అంటూ ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Manchu Vishnu Comments On Tenth Board Exams Abolished. I strongly believe that board exams for 10th Grade must be abolished. Totally. Forever. Not just this year. What is the purpose of this board exam pressure for 14/15year olds?????
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X