మహేష్ బాబు-గౌతమ్ సవాల్.. ఆ వయసులో నువ్ అంత కూడా లేవు.. తమ్ముడి పరువు తీసిన మంజుల
మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో ఇదివరకే అందరికీ తెలిసినా.. ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని మరోసారి నిరూపితమైంది. పిల్లలను నవ్వించడానికి చిన్నపిల్లాడిలా మారిపోయే మహేష్ బాబు.. పసితనాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ స్టార్‌లా విలన్లపై విరుచుకపడే మహేష్ బాబు.. ఇంట్లో పిల్లలతో కలిసి చిన్నవాడిలా ఆటలు ఆడటం, సరదగా గడపడం అందర్నీ ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు ఈ క్వారంటైన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో కలిసి సమయాన్ని గడుపుతూ ఆనందిస్తున్నాడు.

రోజుకో వీడియో..
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ఖుషీ అవుతోంది. రోజుకో వీడియో, ఫోటోలను షేర్ చేస్తూ నమత్ర.. ప్రిన్స్ అభిమానులను సంతోష పెడుతోంది. మహేష్ బాబు ఫోటోలను చూసి.. రోజురోజుకూ మరింత యవ్వనంగా మారిపోతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

మొట్టమొదటి సారిగా అలా..
మహేష్ బాబు షర్ట్ లేకుండా కనబడటం అన్నది ఇంత వరకు జరగలేదు. అలాంటి పరిస్థితి, సీన్స్‌ను కూడా తన సినిమాలో దాదాపు కనిపించవు. ఎందుకంటే బాడీ ఎక్స్‌పోజింగ్ అనేది మహేష్ బాబుకు అంతగా నచ్చదు. అందుకే వన్ నేనొక్కడినేలోనూ వెనుకనుంచి బాడీని చూపిస్తారు. అయితే ఫస్ట్ టైమ్ మహేష్ బాబు షర్ట్ లెస్ ఫోటోను నమ్రత షేర్ చేయడంతో తెగ వైరల్ అయింది. పిల్లలతో కలిసి స్విమ్మింగ్ చేస్తున్న సూపర్ స్టార్ ఫోటోను నమ్రత షేర్ చేసింది.

తండ్రీకొడుకుల సవాల్..
తాజాగా తండ్రీకొడుకులు సవాల్‌కు దిగారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎత్తు ఉన్నారో చూద్దామా రెడీయా అంటూ మహేష్ బాబు గౌతమ్ మీదకు దూసుకువచ్చాడు. ఇద్దరూ అలా నిలబడి ఎవరు హైట్ ఉన్నారో తేల్చుకున్నారు. ఈ వీడియోను మహేష్ బాబు షేర్ చేస్తూ.. హైట్ చెక్.. అతనే పొడుగ్గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
Recommended Video

పరువు తీసిన మంజుల..
మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఈ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. ‘నాకు తెలిసి గౌతమే పొడుగ్గా ఉంటాడు. 13 ఏళ్ల సమయంలో నువ్ అతడి (గౌతమ్) ఎత్తుకు దరిదాపుల్లో కూడా లేవు' అంటూ ఫక్కున నవ్వుత ఎమోజీని షేర్ చేసి మహేష్ పరువును తీసింది.


Click it and Unblock the Notifications











