For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బికినీ ఫొటో పోస్ట్ చేసి బుక్కైపోయింది.. రణ్‌వీర్‌ను కలవడం వల్లే ఇలా..

|

మానుషి చిల్లర్.. ఈ పేరు చాలా మందికి పరిచయం అవసరం లేనిది. దీనికి కారణం ఆమె 18 ఏళ్ళ తర్వాత భారతదేశానికి మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన ముద్దుగుమ్మ కావడమే. ఆ సమయంలో ఈమెకు చాలా పేరొచ్చింది. దీంతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది. కానీ, ఈ అమ్మడు ఎందులోనూ నటించలేదు. పైగా, ఆగిపోయిన తన చదువును కంటిన్యూ చేస్తుంది. ఈ తరణంలో ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది.

అవకాశాలు వదులుకుని..

అవకాశాలు వదులుకుని..

మిస్ వరల్డ్ గెలవకముందు మానుషి.. హరియాణాలోని ఓ ప్రభుత్వ మెడికల్‌ కాజేల్‌లో ఎంబీబీఎస్‌ చేస్తుండేది. అయితే, మిస్‌ వరల్డ్‌ పోటీల కోసం.. ఆమె అప్పట్లో తన చదువు మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైకి బదిలీ అయ్యారు. దీంతో ఇదే నగరంలోని ఓ మెడికల్‌ కాలేజ్‌లో ఆమె చదువు కొనసాగించేందుకు అనుమతి తీసుకుంది. ఇందుకోసం పలు ఆఫర్లను కూడా వదులుకుంది.

చదువు తర్వాతే సినిమాలు

చదువు తర్వాతే సినిమాలు

మానుషి.. తన వైద్య విద్య పూర్తయిన తర్వాతనే సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలోనూ వెల్లడించింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. దీంతో మానుషి ఇప్పట్లో వెండితెరపై కనిపించే అవకాశాలు లేవన్నది స్పష్టమైంది.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్

మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. ఓ వైపు నటనలో కూడా మెలుకువలు నేర్చుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రంగురంగుల ఫొటోను షేర్ చేసింది.

రెయిన్‌బో బికినీతో ట్రోల్స్

రెయిన్‌బో బికినీతో ట్రోల్స్

రెయిన్‌బోలా రంగు రంగులున్న ఓ బికినీ వేసుకుని మానుషి చిల్లర్ తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేసింది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘రణ్‌వీర్ ఎఫెక్ట్ వల్లే ఆమె ఇలా అయిపోయింది' అని ఒకరంటే.. ‘వైద్య విద్యార్థి అయి ఉండి ఇలాంటి ఫొటోలు షేర్ చేయడమేంటి' అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఇలా చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

గతంలో రణ్‌వీర్‌తో యాడ్

గతంలో మానుషి.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించింది. ‘క్లబ్ ఫ్యాక్టరీ యాప్'కు సంబంధించిన ఈ యాడ్ అప్పట్లో బుల్లితెరపై ఊపు ఊపేసింది. ఇది ఆన్‌లైన్ షాపింగ్ యాప్ కావడంతో ఆ తర్వాత దీనికి డౌన్‌లోడ్స్ కూడా భారీగానే వచ్చాయి.

English summary
Manushi Chillar, the Miss World 2017 has been in the limelight ever since she won the crown. This girl from Haryana made India proud and we cannot stop gushing over her pictures.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more