Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇలాంటి వాటికి కూడా పడిపోతారా?.. రష్మికను పెళ్లి చేసుకోవాలంటే చాలా సింపుల్!!
ఇష్కో సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో నిత్యా మీనన్‌కు ఓ ఫాంటసీ ఉంటుంది. గాజులను ఎవరు కొనిస్తారో వారినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. తాజాగా రష్మిక మందాన్న రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఓ ఫాంటసీనే బయటకు చెప్పింది. కానీ ఆ సినిమాలో చెప్పినంత కాస్ట్లీగా అయితే కాదు. ఎవరైతే ఆ కొనిస్తారో వారినే పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టింది. కానీ చివర్లో జోక్ అంటూ ఆశలపై నీళ్లు చల్లింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
రష్మిక ప్రేమ విఫలం..
మామూలుగా రష్మిక ఈపాటికే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సింది. కానీ తెలుగులో అనుకోకుండా వచ్చిన క్రేజ్, నేమ్, ఫేమ్‌తో మొత్తం మారిపోయింది. తాను ఇంకా ఏదో సాధించాల్సింది ఉందని, ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉందని ముందే పసిగట్టి ప్రేమ, పెళ్లి వంటి వాటికి నో చెప్పేసింది. అందుకే నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్లిని ఆపేసింది.
రక్షిత్ శెట్టితో ప్రేమతో..
‘కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాలో రష్మిక, రక్షిత్ శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా వీరిద్దరికీ 2017లో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ 2018లో వీరిద్దరూ విడిపోయారు. రష్మిక తన నిశ్చితార్థానికి ముగింపు పలికింది.
కెరీర్లో జోరు..
ఇక అప్పటి నుంచి రష్మిక కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. మొత్తం సౌత్‌లోనే స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో రష్మిక స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్‌కు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో మంచి హిట్లు కొట్టేసింది.
తాజాగా అలా..
అయితే రష్మిక సోషల్ మీడియాలో ఎంతో ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలా చేసే రష్మిక తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఎవరైతే నాకు డెసర్ట్ కేక్‌ను కొనిస్తారో వారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. అంతలోపే అది జోక్ అంటూ చెప్పేసింది. అంటే రష్మికకు ఆ కేక్ అంటే అంత ఇష్టమని అర్థమవుతోంది.
బిజిబిజీగా..
రష్మిక ప్రస్తుతం బిజిబిజీగా ఉంటోంది. ఈ మధ్యే తమిళ్ సుల్తాన్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పుష్ప సినిమా కోసం రెడీ అవుతోంది. నేడు శర్వానంద్‌తో నటించబోతోన్న ఆడాళ్లూ మీకు జోహార్లు మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఇలా పలు ప్రాజెక్ట్‌లతో రష్మిక బిజిబిజీగా గడుపుతోంది.