twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాంటి వాటికి కూడా పడిపోతారా?.. రష్మికను పెళ్లి చేసుకోవాలంటే చాలా సింపుల్!!

    |

    ఇష్కో సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో నిత్యా మీనన్‌కు ఓ ఫాంటసీ ఉంటుంది. గాజులను ఎవరు కొనిస్తారో వారినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. తాజాగా రష్మిక మందాన్న రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఓ ఫాంటసీనే బయటకు చెప్పింది. కానీ ఆ సినిమాలో చెప్పినంత కాస్ట్లీగా అయితే కాదు. ఎవరైతే ఆ కొనిస్తారో వారినే పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టింది. కానీ చివర్లో జోక్ అంటూ ఆశలపై నీళ్లు చల్లింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    రష్మిక ప్రేమ విఫలం..

    రష్మిక ప్రేమ విఫలం..

    మామూలుగా రష్మిక ఈపాటికే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సింది. కానీ తెలుగులో అనుకోకుండా వచ్చిన క్రేజ్, నేమ్, ఫేమ్‌తో మొత్తం మారిపోయింది. తాను ఇంకా ఏదో సాధించాల్సింది ఉందని, ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉందని ముందే పసిగట్టి ప్రేమ, పెళ్లి వంటి వాటికి నో చెప్పేసింది. అందుకే నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్లిని ఆపేసింది.

    రక్షిత్ శెట్టితో ప్రేమతో..

    రక్షిత్ శెట్టితో ప్రేమతో..

    ‘కిరిక్‌ పార్టీ' అనే కన్నడ సినిమాలో రష్మిక, రక్షిత్‌ శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా వీరిద్దరికీ 2017లో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ 2018లో వీరిద్దరూ విడిపోయారు. రష్మిక తన నిశ్చితార్థానికి ముగింపు పలికింది.

    కెరీర్‌లో జోరు..

    కెరీర్‌లో జోరు..

    ఇక అప్పటి నుంచి రష్మిక కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. మొత్తం సౌత్‌లోనే స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో రష్మిక స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్‌కు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో మంచి హిట్లు కొట్టేసింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే రష్మిక సోషల్ మీడియాలో ఎంతో ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలా చేసే రష్మిక తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఎవరైతే నాకు డెసర్ట్ కేక్‌ను కొనిస్తారో వారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. అంతలోపే అది జోక్ అంటూ చెప్పేసింది. అంటే రష్మికకు ఆ కేక్ అంటే అంత ఇష్టమని అర్థమవుతోంది.

    బిజిబిజీగా..

    బిజిబిజీగా..

    రష్మిక ప్రస్తుతం బిజిబిజీగా ఉంటోంది. ఈ మధ్యే తమిళ్ సుల్తాన్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పుష్ప సినిమా కోసం రెడీ అవుతోంది. నేడు శర్వానంద్‌తో నటించబోతోన్న ఆడాళ్లూ మీకు జోహార్లు మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఇలా పలు ప్రాజెక్ట్‌లతో రష్మిక బిజిబిజీగా గడుపుతోంది.

    English summary
    Marry Rashmika Mandanna By Buying Dessert Cake, Rashmika Mandanna Wants To Marry A Man Who Will Buys And Gives dessert Cake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X