RRR vs Master: ఎన్టీఆర్ కంటే మొండిగా విజయ్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న ఫ్యాన్స్.. తగ్గేలా లేరు!
లాక్ డౌన్ కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక అభిమానులు కూడా ఇష్టమైన స్టార్ సినిమాలను ఎంతగా మిస్ అవుతున్నారో సోషల్ మీడియాపై లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక కరోనా తగ్గకపోయినా కూడా థియేటర్స్ తెరచుకుంటాయని ఎవరు ఊహించలేదు. ఇక దాదాపు పది నెలల టారువత బాక్సాఫీస్ వద్ద అసలైన జోరు మొదలు కాబోతోంది. జనవరిలో ఇండియాలోనే అత్యంత బజ్ ను క్రియేట్ చేస్తున్న మాస్టర్ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. అయితే రీసెంట్ గా మాస్టర్ vs RRR కు మధ్య ఒక రసవత్తరమైన పోటీ జరిగింది.

నార్త్ లో కూడా మాస్టర్ హవా..
ఇళయదలపతి విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేయడం కామన్. ఇక ప్రస్తుతం అందరి చూపు మాస్టర్ సినిమాపైనే పడింది. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. సౌత్ లోనే కాకుండా సినిమా నార్త్ లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో..
మాస్టర్ జనవరి 13న తమిళ్ తెలుగులో రిలీజ్ అవుతుండగా హిందీలో జనవరి 14న సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే మొదటి రోజే బాక్సాఫీస్ కలెక్షన్స్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. గత సినిమాల రికార్డులైతే తప్పకుండా బ్లాస్ట్ అవుతాయనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే టీజర్ తోనే సినిమా ఊహించని విధంగా క్రేజ్ అందుకుంది.

విజయ్ vs ఎన్టీఆర్..
అయితే ఒక విషయంలో విజయ్ ఫ్యాన్స్ VS జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలే కామెంట్స్ వార్ గట్టిగానే జరిగింది. యూ ట్యూబ్ లో మాస్టర్ సినినిమా టీజర్ ఊహించని విధంగా రికార్డులు బ్రేక్ చేసింది. ఒక నెలలోనే RRR సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ రికార్డులను కూడా చెరిపేసింది. ఎన్టీఆర్ రెండు నెలల్లో అందుకున్న ఫీట్ ను విజయ్ ఒక నెలలోనే బ్రేక్ చేశాడు.

అభిమానుల సరికొత్త టార్గెట్
రామరాజు ఫర్ భీమ్ తెలుగు టీజర్ 36M వ్యూవ్స్ అందుకోగా 9లక్షల కామెంట్స్ తో న్యూ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇతర టీజర్ కు దక్కని కామెంట్స్ రికార్డును అభిమానుల ద్వారా సాధించాడు ఎన్టీఆర్. గతంలో వ్యూవ్స్ అనేది టార్గెట్ గా పెట్టుకున్న అభిమానులు ఈ సారి కామెంట్ బాక్స్ ను కూడా టార్గెట్ గా సెట్ చేసుకోవడం వైరల్ గా మారింది.

RRRను డామినేట్ చేసిన మాస్టర్
ఇక విజయ్ ఫ్యాన్స్ ఆ విషయాన్ని చాలెంజ్ గా తీసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ముందుగానే టీజర్ కోసం ప్రమోట్ చేశారు. ఇక నెలలోనే మాస్టర్ తమిళ్ టీజర్ 51M వ్యూవ్స్ ను అందుకుంది. ఇక కామెంట్ బాక్స్ అయితే 1M దాటేసింది. రానున్న రోజుల్లో ఈ విధంగా కూడా పోటీలు ఎక్కువయ్యేలా ఉన్నాయని చాలా ఈజీగా అర్ధమవుతోంది. మరీ మాస్టర్ సినిమా అభిమానుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











