ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను జైల్లో పెట్టిస్తా.. మీరా చోప్రాకు చిన్మయి, నెటిజన్ల మద్దతు.. కొత్త మలుపుతో

తెలుగులో వాన, బంగారం వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది మీరా చోప్రా. అయితే ఇన్నేళ్లకు మళ్లీ మీరా చోప్రా పేరు తెలుగు నాట సంచలనం సృష్టిస్తోంది. కారణం ఏంటంటే.. ఆమె చేసిన ఓ కామెంటే. ఓ హీరో తనకు ఇష్టమని, మరో హీరో ఎవ్వరో తనకు తెలీదని, ఆయన ఫ్యాన్‌ను కాదని చెప్పుకొచ్చింది. ఇక అక్కడితో గొడవ మొదలైంది. పచ్చి బూతులతో సదరు హీరో ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ఆమెపై దాడి చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారం గాలి వాన చిలికి చిలికి తుపానులా మారినట్టు అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

Recommended Video

NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!
 నెటిజన్లతో చిట్ చాట్..

నెటిజన్లతో చిట్ చాట్..

మీరా చోప్రా జూన్ 1న తన అభిమానులతో ట్విట్టర్‌లో చాట్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో తెలుగు నుంచి ఇష్టమైన హీరో ఎవరని అడిగితే మహేష్ బాబు అని తెలిపింది. అదే క్రమంలో జూ ఎన్టీఆర్ గురించి చెప్పండని అడిగితే.,. అతను ఎవరో తెలీదని, ఆయన ఫ్యాన్‌ను కాదని చెప్పుకొచ్చింది.

అక్కడితో వ్యవహారం మొదలు..

అక్కడితో వ్యవహారం మొదలు..

ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. ఇక ఫ్యాన్స్ అందరూ కలిసి ఆమెను బండ బూతులు తిట్టారు. గతంలో ఎన్టీఆర్ సినిమాలో చాన్స్ వచ్చిందని, అయితే మళ్లీ మిస్ కావడంతో ఇలా హర్ట్ అయిందని, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తోందని కొంతమంది అంటున్నారు.

పచ్చిబూతులతో ఫైర్..

పచ్చిబూతులతో ఫైర్..

మీరా కొన్ని వందల వేల ట్వీట్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. రాయలేని పదాలు, వినలేని పదజాలంతో విరుచుకుపడుతున్నారు. దీంతో విసుగెత్తిన మీరా చోప్రా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బకు ఇలా చేసే వారందరికీ ఓ చెంపదెబ్బ కొట్టినట్టు అవుతుంది.

ఫ్యాన్ కాకపోవడం నేరమా?

ఫ్యాన్ కాకపోవడం నేరమా?

ఇక ఇలాంటి ట్వీట్లు రావడంతో విసుగెత్తిన మీరా చోప్రా.. ‘ఒకరి ఫ్యాన్ కాకపోవడం అదేమైనా నేరమా? నాకు మాత్రం ఆ విషయం తెలీదు.. కానీ నేను మాత్రం ఓ విషయాన్ని అరిచి చెప్పాలనుకుంటున్నాను.. మీరు ఒక వేళ ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే మిమ్మల్ని రేప్ చేస్తారు, చంపుతారు, గ్యాంగ్ రేప్ చేస్తారు, మీ తల్లిదండ్రులను చంపుతారట. అలా అని ఆయన ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. వారంతా వారి హీరో పరువును తీస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది.

స్పందించిన చిన్మయి..

స్పందించిన చిన్మయి..

ఇలాంటి వ్యవహారం జరుగుతూ ఉంటే చిన్మయి ఖాళీగా ఉంటుందా? మీరా చోప్రాకు మద్దతు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయండని సలహా ఇచ్చింది. అయితే ఎవరి మీద ఇవ్వాలి ఎంతమంది మీద ఇవ్వాలని నైరాశ్యంలో మీరా చోప్రా స్పందించింది.

ఉదహరణలు చెప్పిన చిన్మయి..

ఉదహరణలు చెప్పిన చిన్మయి..

గతంలో ఇలా జరిగిన సంఘటనలు చెప్పుకొచ్చింది. తనకు, ఓ నటికి, ఓ జర్నలిస్ట్‌కు ఎదురైన ఘటనలను వివరించింది. నెటిజన్స్ పెట్టే ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకోండని, వాటి ద్వారా ఫిర్యాదు చేద్దామని సలహా ఇచ్చింది. మీరా స్పందిస్తూ.. అయినా నేను ఇలాంటి వారి బెదిరింపులకు భయపడనని, అలాగే చేద్దామని చెప్పుకొచ్చింది.

ఫాలోవర్స్‌ను కోరిన మీరా..

ఫాలోవర్స్‌ను కోరిన మీరా..


ఇది తన ఒక్కదాని సమస్య కాదని, మహిళలందరి సమస్య అని పేర్కొంది. ఇలాంటి వారికి బుద్ది చెప్పాలని తెలిపింది. చిన్మయి సలహాను మీరాచోప్రా పాటిస్తూ.. తనకు తెలుగు రాదని, తనను తిట్టిన వారి ట్వీట్ల స్క్రీన్ షాట్లు తనకు పంపండని తన ఫాలోవర్స్‌ను కోరింది. వారందరిపై ఫిర్యాదులు చేస్తానని, ఈ విషయాన్ని వదిలేదే లేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X