వైరల్‌గా మారిన మెగా బ్రదర్స్ అరుదైన ఫోటో!
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా వీరి మధ్య సాన్నిహిత్యం బయటపడుతూ ఉంటుంది. తాజాగా నాగబాబు వివాహానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఈ అరుదైన ఫోటో చూసి మెగా ఫాన్స్ సంబర పడుతున్నారు.
నాగబాబు పెళ్లి ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఉన్నారు. చిరు కుమార్తె సుస్మిత, క్యూట్ లుక్స్ తో రాంచరణ్ కనిపిస్తున్నారు. మెగా బ్రదర్స్ క్లోజ్ గా ఉన్నా ఈ ఫోటో ఫాన్స్ ఆకర్షిస్తోంది.

చిరు ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సైరా టీం జార్జియాలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నాగబాబు టివి కార్యక్రమాలు, సినిమాల్లో పాత్రలతో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











