అక్కినేని హీరోతో వైష్ణవ్ తేజ్ మరో సినిమా.. కుర్రాడి స్పీడ్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. సైలెంట్ గా మొదలైన ఉప్పెన సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా అసలు థియేటర్స్ లోకి వస్తుందా? లేదా ఓటీటీ లోనే రిలీజ్ అవుతుందా అని చాలా రూమర్స్ వచ్చాయి. ఇక మొత్తానికి నిర్మతల జాగ్రత్తతో సినిమా థియేట్రికల్ గా విడుదలైంది. ఉప్పెన సక్సెస్ తో ఇప్పుడు వైష్ణవ్ కు భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. అక్కినేని హీరోతో కూడా కలిసి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నెంబర్ వన్ డెబ్యూ హీరోగా..
మొత్తానికి ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ కొట్టేసింది. వరల్డ్ వైడ్ గా 50కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రికార్డును వైష్ణవ్ మూడు రోజుల్లోనే ఫినిష్ చేశాడు. అత్యదిక వసూళ్లను అందుకున్న బెస్ట్ డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

త్వరలోనే క్రిష్ సినిమా
ఇక ఉప్పెన తరువాత వైష్ణవ్ తేజ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తయ్యింది. కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో వైష్ణవ్ సీరియస్ లుక్ లో కనిపించనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఉప్పెన హిట్టవ్వడంతో త్వరలోనే ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అది మల్టీస్టారర్ కాదు
అయితే ఆ సినిమా తరువాత మజిలీ నిర్మాతలతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు గాని కమిట్మెంట్ అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని హీరోతో కూడా త్వరలోనే ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అది మల్టీస్టారర్ సినిమా కాదు.

నాగార్జున సెట్ చేసిన స్టోరీ
అక్కినేని నాగార్జున హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేయడానికి సిద్ధాంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక కొత్త దర్శకుడు చెప్పిన ఇంట్రెస్టింగ్ లవ్ స్టొరీపై నాగార్జున పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట. ప్రస్తుతం అఖిల్, నాగ చైతన్య వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన వారి గురించి ఆలోచించలేదట. వైష్ణవ్ తేజ్ కు అయితే కరెక్ట్ గా సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే హోమ్ ప్రొడక్షన్ లోనే మెగా హీరోతో సినిమా చేయలని ఫిక్స్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











