Happy Birthday Ram Charan: ఆ రికార్డును సాధించిన ఏకైక హీరో.. చిరంజీవి కోసం భారీ రిస్క్ చేసిన చరణ్!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగంలోకి ప్రవేశించాడు రామ్ చరణ్. 'చిరుత' అనే సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాతి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా పలు పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి సమయంలోనే పంథాను మార్చుకుని విజయాల బాట పట్టాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈ మెగా పవర్ స్టార్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా అతడి కెరీర్‌లోని ఘనతలను చూద్దాం పదండి!

రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్.. రికార్డు స్థాయి
'చిరుత' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ, రెండో చిత్రం 'మగధీర'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడీ మెగా హీరో. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కలెక్షన్లను కూడా రికార్డు స్థాయిలో రాబట్టింది. ఫలితంగా అతడి రేంజ్ పెరిగిపోయింది.

భారీ డిజాస్టర్.. హిందీ చిత్రం... బన్నీతో కలిశాకే
'మగధీర' వంటి భారీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన చిత్రం 'ఆరెంజ్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీని తర్వాత కూడా ఆశించిన విజయం దక్కలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రంలోనూ నటించాడు. అది కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ పరిస్థితుల్లో బన్నీతో కలిసి చేసిన 'ఎవడు' మూవీతో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

వరుస ఫ్లాపులు.. మళ్లీ ఇండస్ట్రీ హిట్ వచ్చింది
'ఎవడు' వంటి హిట్ తర్వాత 'గోవిందుడు అందరి వాడేలే', 'బ్రూస్‌లీ', వంటి వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నాడు రామ్ చరణ్. వీటి తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ధృవ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ఇందులో రామ్ చరణ్ నటుడిగా ఉన్నత స్థాయిలో చేశాడు.

తండ్రి కోసం భారీ రిస్క్ చేసిన మెగా పవర్ స్టార్
ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు రామ్ చరణ్. ఆయనను సినిమాల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' కోసం భారీ ఖర్చుతో రిస్క్ చేశాడు. అప్పటి నుంచి చిరు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు.

రెండు చిత్రాలు.. నందమూరి హీరోతో.. చిరుతో
'వినయ విధేయ రామ' వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రమే RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఇది రూపొందుతోంది. ఇందులో చరణ్.. అల్లూరిగా నటిస్తున్నాడు. దీనితో పాటు కొరటాల - చిరు కలయికలో వస్తున్న 'ఆచార్య'లోనూ రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రను చేస్తున్నాడు.

అన్నీ తానై.. ప్రజా సేవలో.. అవార్డులతో రికార్డ్
చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలను మోస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమాల పరంగా హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న అతడు.. ఎన్నో అవార్డులు అందుకుని రికార్డులకెక్కాడు. అదే సమయంలో భార్య ఉపాసన కోసం అపోలో ఆస్పత్రిలో భాగమై సేవ చేస్తున్నాడు. వీటితో పాటు బ్లడ్ బ్యాంకును స్వయంగా నడుపుతూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు.

రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్.. అతడికే సాధ్యమైంది
సుదీర్ఘమైన కెరీర్‌లో చరణ్ ఎన్నో సినిమాల్లో నటించాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. స్టార్ హీరోలు అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల్లో మరెవరూ చేయలేదు. అలాగే, సినిమా కోసం ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటాడు. ఇలా అతడి కెరీర్ మరింత ఉన్నతంగా సాగాలని కోరకుంటూ.. రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











