మెగాస్టార్ ఏమాత్రం తగ్గడంలేదట.. 1000 మందితో డ్యాన్స్.. సెన్సేషనల్‌గా సైరా పాట!
Recommended Video

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై సైరా నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా విషయాలను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటులు జన్మదినం రోజున వారి గెటప్‌లను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. సైరా సినిమా షూటింగ్ గురించి మరిన్నీ వివరాలు..

భారీ స్ఠాయిలో సైరా పాట చిత్రీకరణ
ఇటీవల హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలోని నల్లగొండ జిల్లా సరిహద్దులో భారీ స్థాయిలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా మారిందంట. జాతర నేపథ్యంగా సాగే ఈ పాటలో 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు ఐదు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించినట్టు సమాచారం.

మెగాస్టార్‌తోపాటు ఇతర నటీనటులు
జాతర బ్యాక్‌డ్రాప్‌గా వచ్చేపాటలో మెగాస్టార్ చిరంజీవితోపాటు సినిమాలో నటించే ప్రధాన పాత్రధారులంతా ఈ పాటలో పాల్గొన్నట్టు సమాచారం. తమన్నా, జగపతిబాబు, సుదీప్, ఇతర నటీనటులు భారీగా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ పాట కోసం అద్భుతంగా సెట్స్‌ను డిజైన్ చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

కిక్కిరిసిన షూటింగ్ పరిసరాలు
సైరా పాటలో పాల్గొనేందుకు భారీగా డ్యాన్సర్లు తరలిరావడంతో షూటింగ్‌కు చేరువగా ఉన్న మోస్టారు పట్టణంలో వారికి బస ఏర్పాట్లు చేశారట. దాంతో ఆ ప్రాంతంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయట. దాంతో కొందరిని హైదరాబాద్ నుంచి ఉదయం 4 గంటల నుంచే షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది.

రూ. 200 కోట్ల బడ్జెట్‌తో
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న సైరా రూ.200 కోట్లకుపైగా వ్యయంతో రూపొందుతున్నది. దక్షిణాది అన్ని భాషలతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇటీవల రాంచరణ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











