For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Best Movies Of Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద జగదేక వీరుడు.. డైలాగ్స్ లో ఇంద్రుడు.. చిరు బెస్ట్ హిట్స్!

    |

    టాలీవుడ్ మెగాస్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను అందుకోవాల్సిందే. దాదాపు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా భారీ ఓపెనింగ్స్ తోనే సగం ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తాయి. మెగాస్టార్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదట్లోనే అనేక ప్రయోగాత్మకమైన పాత్రలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అనంతరం తన సినిమాలోని పాటలను కూడా సొంతంగా కొరియోగ్రఫీ చేసుకునే స్థాయికి ఎదిగాడు. డైలాగ్ డెలివరీలో మెగాస్టార్ తరువాతే ఎవరైనా అనేలా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఇక నేడు చిరంజీవి 66వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇక ఆయన టాప్ మూవీస్ సాంగ్స్ డైలాగ్స్ వంటి అంశాల్లో కి వెళితే..

    ఖైదీ సినిమాతో

    ఖైదీ సినిమాతో

    మెగాస్టార్ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమాలో ఖైదీ సినిమా చాలా ముఖ్యమైనది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983 లో వచ్చిన ఈ సినిమా చిరంజీవికి ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఖైదీ సినిమాలో ఫైట్స్ సాంగ్స్ అలాగే మెగాస్టార్ స్టెప్పులు కూడా అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే ఇప్పటికీ కూడా సరికొత్తగా ఫీల్ ను కలిగిస్తాయి. ఎన్ని సార్లు చూసినా కూడా బోర్ కొట్టని ఖైదీ సినిమా మెగాస్టార్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అని చెప్పవచ్చు.

     స్వయంకృషితో

    స్వయంకృషితో

    కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి ఆపద్బాంధవుడు, శుభలేఖ వంటి విభిన్నమైన క్లాసిక్ సినిమాలు చేశాడు. ఇక స్వయంకృషి సినిమా కూడా మెగాస్టార్ ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. 1987 లో వచ్చిన ఆ సినిమా చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గర చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ యాక్షన్ సీన్స్ తో స్టైలిష్ డ్యాన్స్ లు లేకపోయినప్పటికీ తన నటనతోనే బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేశాడు. అలాగే మెగాస్టార్ పలు పురస్కారాలను కూడా అందుకున్నాడు

     అబ్బనీ తియ్యని దెబ్బ ..

    అబ్బనీ తియ్యని దెబ్బ ..

    మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సినిమాలు చేసినా కూడా అందులో ఆల్ టైం బెస్ట్ సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అప్పట్లో అత్యధిక వసూళ్లను అందుకుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇళయరాజా అందించిన పాటలు కూడా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. కేవలం స్పీడ్ డాన్స్ లోనే కాకుండా సింపుల్ స్టెప్పులతో కూడా మెగాస్టార్ ఆకట్టుకోగలరని మరోసారి నిరూపించారు. అందులో వచ్చిన అబ్బనీ తియ్యని దెబ్బ పాట అప్పట్లో కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూళ్లను అందుకునే.

    ఆ సినిమాలతో నటుడిగా మరో స్థాయికి

    ఆ సినిమాలతో నటుడిగా మరో స్థాయికి

    శుభలేఖ ఆరాధన విజేత వంటి సినిమాలు కూడా మెగాస్టార్ ని నటుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ముఖ్యంగా ఛాలెంజ్ సినిమాలో ఇప్పటికి కూడా నేటి తరం యువ హీరోలకు ఒక ప్రత్యేకమైన అనుబూతిని ఇస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ ఎదిగిన విధానం ఆ సినిమాతో అర్థమవుతుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. రౌడీ అల్లుడు కూడా మెగాస్టార్ ను మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది.

    కొండవీటి దొంగ

    కొండవీటి దొంగ


    కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరొక యాక్షన్ డ్రామా కొండవీటి దొంగ కూడా మెగాస్టార్ జీవితంలో ఒక మర్చిపోలేని సినిమా అని చెప్పవచ్చు. 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి మరోసారి మెగాస్టార్ తో జతకట్టింది. ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో బెస్ట్ హిట్స్ గా నిలిచాయి. మెగాస్టార్ స్టెప్పులు ఇప్పటికి కూడా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా కూడా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది

    గ్యాంగ్ లీడర్

    గ్యాంగ్ లీడర్

    మెగాస్టార్ చిరంజీవి జీవితంలో గ్యాంగ్ లీడర్ సినిమా ప్రస్తావించకుండా ఆయన గురించి మాట్లాడడం కుదరనే కుదరదు. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త స్టైల్ తోనే కాకుండా అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో కూడా ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా మరోసారి నిర్మించగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది మెగాస్టార్ డైలాగ్స్ ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

    మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..

    మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..

    2002లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సత్తా ఏమిటో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలిసొచ్చింది. ఆ సినిమాలో ప్రతి డైలాగ్ కూడా మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా మరోసారి నంది అవార్డును ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అని డైలాగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం. దాయి దాయి దామ అనే పాట కూడా అప్పట్లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    టంగు తెగుద్ది..

    టంగు తెగుద్ది..

    మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఠాగూర్ కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చినప్పటికీ మెగాస్టార్ తన బాడీ లాంగ్వేజ్ తో కొత్త రూపాన్ని ఇచ్చారు. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం.. టంగు తెగుద్ది.. అని డైలాగ్ కూడా అభిమానుల చేత విజిల్స్ వేయించింది. ఆ సినిమా అనంతరం మళ్లీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ వినాయక్ కాంబినేషన్లో ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుని మెగాస్టార్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది.

    Brandy Diaries ఫ్రెండ్షిప్ కి నిదర్శనం.. క్రౌడ్ ఫండెడ్ మూవీ - Director Sividu
    ఎన్నో హిట్ సినిమాలు..

    ఎన్నో హిట్ సినిమాలు..


    152 సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి సైరా, ముఠా మేస్త్రి, శంకర్ దాదా ఎంబిబిఎస్, స్టాలిన్, ఘరానా మొగుడు, పసివాడి ప్రాణం రౌడీ అల్లుడు, చంటబ్బాయి, అన్నయ్య, అందరివాడు వంటి సినిమాలు కూడా చిరంజీవి స్థాయిని మరింత పెంచాయి. దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Megastar chiranjeevi all time best movies and best songs and dialouges. Happy birthday Megastar chiranjeevi first remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X