For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవి కెరీర్‌లో డైరెక్షన్ చేసిన సినిమా ఏంటో తెలుసా..? అది సూపర్ హిట్ అయింది

|
Do You Know Gang Leader Movie Was Directed By Megastar Chiranjeevi?? || Filmibeat Telugu

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ప్రత్యేక సినిమా గురించి తెలుసుకుందాం.

ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

చిరంజీవి తన తొలినాళ్లలో అందరిలానే యాక్టింగ్‌పైనే దృష్టి సారించారు. అందుకే ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధం అయ్యారు. కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా కనిపించారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఈ క్రమంలోనే ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్‌లో తనను తాను నిరూపించుకుంటూ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.

మెగా ఫోన్ పట్టుకున్న సినిమా ఇదే

మెగా ఫోన్ పట్టుకున్న సినిమా ఇదే

చిరంజీవి అంత పేరు సంపాదించుకున్నా.. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నా డైరెక్షన్ వైపు వెళ్లలేదు. అయితే, ఆయన మాత్రం ఓ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అది కూడా తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘గ్యాంగ్ లీడర్' సినిమాకు. అవును.. ఈ సినిమాకు చిరంజీవి దర్శకత్వం వహించారు. అయితే, మొత్తం సినిమాకు కాదు.. కొంత భాగానికి మాత్రమే. ఈ విషయాన్ని సీనియర్‌ నటుడు నారాయణరావు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

చిరంజీవికి చెప్పారు

చిరంజీవికి చెప్పారు

ఆ ఇంటర్వ్యూలో నారాయణరావు మాట్లాడుతూ.. ‘‘విజయ బాపినీడు-చిరంజీవి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆ సమయంలోనే ‘గ్యాంగ్‌ లీడర్‌' కథ సిద్ధమైంది. అందులో చిరు స్నేహితుడిగా నాకు మంచి వేషం ఇచ్చారు. దాదాపు సగం సినిమా చూసిన తర్వాత చిరు రషెస్‌ వేసుకుని చూశారు. ‘అనుకున్న దానికంటే బాగా రాలేదు బాపినీడుగారు' అని చిరంజీవి అంటే, ‘మీరు కూడా ఓ చేయి వేస్తే బాగుంటుంది' అని బాపినీడు కోరారు'' అని ఆయన వెల్లడించారు.

ముఖ్యమైన సీన్స్ చిరునే చేశారు

ముఖ్యమైన సీన్స్ చిరునే చేశారు

ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన సీన్స్‌కు చిరునే దర్శకత్వం వహించారని నారాయణరావు తెలిపారు. ‘‘నాకు తెలిసి అప్పటివరకూ చిరంజీవి డ్యాన్స్‌లు, ఫైట్లు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. కథ విన్నప్పుడే మార్పులు చేర్పులు చెప్పేసేవారు. కానీ, ‘గ్యాంగ్‌ లీడర్‌' సినిమా దాదాపు 40శాతం చిరంజీవి రీషూట్‌ చేశారు. మురళీమోహన్‌ను హత్య చేసే సన్నివేశం, ఆయన స్నేహితులమైన మమ్మల్ని వెంటాడి చంపే సీన్లు అవన్నీ చిరు తీశారు'' అని ఆయన చెప్పారు.

 ఆ విషయం ఎక్కడా చెప్పుకోలేదు

ఆ విషయం ఎక్కడా చెప్పుకోలేదు

అలాగే, దీనిపై మాట్లాడుతూ.. ‘‘అప్పటివరకూ గొప్ప నటుడు ఉన్నాడని మాత్రమే నాకు తెలుసు. కానీ, అది చూసిన తర్వాత ఆయనలో ఓ గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని అర్థమైంది. ఈ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పుకోలేదు. ఆ తర్వాత నేను కూడా చాలా సార్లు డైరెక్షన్‌ చేయాలని చెప్పా. తనకు ఇష్టం లేదని చెప్పేవారు. ఒక విధంగా చెప్పాలంటే తెర మీద పేరు పడని దర్శకుడాయన'' అని నారాయణరావు చెప్పుకొచ్చారు.

English summary
Konidela Siva Sankara Vara Prasad (born 22 August 1955), better known by his stage name Chiranjeevi, is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more