RRRపై రిలీజ్ డేట్‌పై అనుమానాలు.. చిరంజీవియే కారణమా?
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాక.. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం RRR. 'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా... టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో కలిసి నటిస్తున్నారు. భారీ లెవెల్‌లో రూపొందుతోన్న సినిమా కావడంతో దీనిపై ఆది నుంచీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. దీంతో RRR విడుదలపై అనుమానాలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

రియల్ హీరోలను రీల్‌పై చూపించబోతున్నారు
స్వాతంత్ర్యానికి ముందు దేశం కోసం పోరాటం చేసిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన విప్లవ వీరుడు కొమరం భీం కథతో RRR రూపొందుతోంది. అల్లూరి పాత్రలో చరణ్.. భీంగా తారక్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ మూవీకి కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వదిలి పెట్టలేదు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. దీంతో ప్రతి ఇండస్ట్రీ నుంచి నటీనటులకు ఇందులో పాత్రలు కల్పించాడు రాజమౌళి. అలాగే, హాలీవుడ్ నుంచి సైతం పలువురు నటీనటులను తీసుకున్నారు. మరికొందరితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

RRR నుంచి వరుస సర్‌ప్రైజ్‌లు.. రెస్పాన్స్ ఇలా
RRR మూవీని ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ తమ హీరోలు ఎలా ఉంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, జక్కన్న మాత్రం చాలా రోజుల తర్వాత అంటే ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్, రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ రెండింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఆ విషయంలో మాట మీద నిలబడని జక్కన్న
ఈ సినిమా ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. అయినప్పటికీ షూటింగ్ తక్కువ భాగమే పూర్తయింది. వాస్తవానికి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, అనివార్య కారణాల వల్ల అది కాస్తా 2021 జనవరి 8కి మారింది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

RRR రిలీజ్ డేట్‌పై అనుమానాలు.. కారణం ఇదే
రెండు మూడు రోజులుగా ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అతడు RRR షూటింగ్‌కు నెల రోజుల విరామం ప్రకటించి, తన తండ్రి నటిస్తున్న ‘ఆచార్య'లో నటిస్తున్నాడన్నదే ఆ వార్త సారాంశం. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి RRR మూవీ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మూవీపై చిరంజీవి ప్రభావం.. రెండు సార్లు వాయిదా
గతంలో ‘సైరా: నరసింహారెడ్డి' సమయంలోనూ చరణ్... RRR షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి ‘ఆచార్య' కోసం అది రిపీట్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై చిరంజీవి ప్రభావం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఒకవేళ మూవీ మళ్లీ వాయిదా పడితే మెగాస్టార్ సినిమాలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











