శతమానం భవతి: 40 ఏళ్ల చిరంజీవి దాంపత్య జీవితం.. పెళ్లిరోజున!
సినీ పరిశ్రమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి కుటుంబ విలువలను పాటించడంలో ముందు వరుసలో ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్‌గా చిరంజీవికి ఇండస్ట్రీలో గొప్ప గౌరవం ఉందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అలాంటి చిరంజీవి దాంపత్య జీవితం 40 ఏళ్ల పడిలోకి అడుగుపెట్టింది. సుదీర్ఘమైన జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్‌కు హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ చెబుతుంది తెలుగు ఫిల్మీబీట్. వివరాల్లోకి వెళితే..

చిరంజీవి తపన చూసి
కొణిదెల శివ శంకర వరప్రసాద్ చిరంజీవిగా మారి తెలుగు సినిమాలో సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకొనేందుకు ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో అనుక్షణం పడే తపన, నటనపట్ల అంకితభావంతో కూడిన చిరంజీవిని చూసి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య ముచ్చటపడేవారట. ఏకంగా తనపై ఉన్న అభిమానానికి బంధుత్వ రూపం ఇచ్చారు.

40 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం
డైనమిక్ హీరోగా చిరంజీవి రాణిస్తున్న సమయంలోనే వివాహం జరిగింది. అల్లు రామలింగయ్య గారి కూతురు అల్లు సురేఖను ఫిబ్రవరి 20, 1980లో చిరంజీవి వివాహమాడారు. పెళ్లి అనంతరం చిరంజీవి గ్రాఫ్ రివ్వును దూసుకెళ్లడమే కాకుండా మెగాస్టార్‌గా మారారు. దాదాపు 40 సుదీర్ఘమైన దాంపత్య జీవితం ప్రశాంతంగా కొనసాగుతున్నది.

జీవిత భాగస్వామిగా సురేఖ
జీవిత భాగస్వామిగా సురేఖ అండతో అనేక గౌరవాలను, అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం తెలిసిందే. అభిమానుల పట్ల సురేఖ చూపించే అభిమానాన్ని గొప్పగా చెప్పుకొంటారు. ఫ్యామిలీ నుంచి అలాంటి ఆదరణ ఉండటం వల్లనే చిరంజీవి కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంత చేసుకొన్నారని చెప్పవచ్చు.

చిరంజీవి విజయాల వెనుక
ఇక సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ప్రయత్నం చేయడంలో చిరంజీవికి భార్య సురేఖ సహకారం సంపూర్ణంగా ఉందని సినీ వర్గాలు చెప్పుకొంటారు. పార్టీ అధినేతగా, కేంద్రమంత్రిగా, సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోగా ఎన్నో గౌరవ, సత్కారాలను అందుకోవడం తెలిసిందే. ఇలాంటి గొప్ప విషయాల నేపథ్యంగా చిరంజీవి వైవాహిక జీవితం నూరేళ్లు కొనసాగాలని అభిమానులు కోరుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











