ఉప్పెన టీమ్‌కు మెగాస్టార్ ఖరీదైన గిఫ్ట్.. చిన్నదే అయినా ధర మాత్రం పెద్దదే..!
పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా మొదలైన ఉప్పెన సినిమా రెండేళ్ల అనంతరం బాక్సాఫీస్ వద్ద ఉప్పెనలా సంచలనం సృష్టిస్తుందని సుకుమార్ తప్పితే మరెవరూ ఉహీంచలేదు. ఫైనల్ గా సినిమాకు పని చేసిన వారికి అలాగే నటీనటులకు సినిమా మరచిపోలేని విజయాన్ని అందించింది. హీరో వైష్ణవ్ కు అలాగే హీరోయిన్ కృతి శెట్టికి అయితే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక సక్సెస్ వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ సబ్యులకు మెగాస్టార్ ఇచ్చిన కానుక ఖరీదు ఇప్పుడు వైరల్ గా మారింది.

హిట్టు కంటే ముందే ఆఫర్స్..
గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా అసలు థియేటర్స్ లోకి వస్తుందా? లేదా ఓటీటీ లోనే రిలీజ్ అవుతుందా? అని చాలా రూమర్స్ వచ్చాయి. మొత్తానికి నిర్మతల జాగ్రత్తతో సినిమా థియేట్రికల్ గా విడుదలైంది. ఉప్పెన సక్సెస్ తో ఇప్పుడు సినిమా నటీనటులులకు అలాగే టెక్నీషియన్లను భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. హీరో మూడో సినిమాకు ప్లాన్ చేస్తుండగా హీరోయిన్ రెండు సినిమాలతో బిజీగా మారింది.

మెగాస్టార్ ఫుల్ హ్యాపీ...
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ విజయానికి ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు అర్ధమయ్యింది. ఎందుకంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో కూడా ఇలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే తానేంటో నీరూపించుకున్నాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బుచ్చిబాబు డైరెక్షన్ బేబమ్మ నటన ఇలా అన్ని కలిసి రావడం మెగాస్టార్ ను ఎంతగానో ఆనందానికి గురి చేసింది.

చిత్ర యూనిట్ సబ్యులకు చిరు కానుక
ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ సభ్యులందరిని ప్రశంసిస్తూ ఒక ఖరీదైన కానుకను కూడా పంపారు. ఇటీవల దేవిశ్రీప్రసాద్ కు అలాగే హీరోయిన్ కృతి శెట్టికి అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకు ఒకే రకమైన ప్రేమ కానుకను పంపారు. ముఖ్యంగా బేబమ్మను పొగుడుతూ.. నువ్వు పుట్టుకతోనే ఒక స్టార్ అంటూ.. కేవలం స్టార్ మాత్రమే కాదు అమేజింగ్ ఆర్టిస్ట్ కూడా కృతి ప్రతిభను ఒక లెటర్ ద్వారా కొనియాడారు.

ఆ కానుక ధర ఎంతంటే?
ఇక మెగాస్టార్ ఇచ్చిన కానుక వివరాల్లోకి వెళితే.. సినిమా అర్దాన్ని చూపేలా ఒక సముద్రపు ఒడ్డున ప్రేమ జంట మోకాళ్లపై హత్తుకొని ఉన్నట్లు ఉంది. 'ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్' పేరుతో మార్కెట్ లో దొరుకుతున్న ఈ గిఫ్ట్ ధర రూ.83వేలు అని తెలుస్తోంది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ 'లాడ్రో' దీన్ని విక్రయిస్తోంది. చిత్ర యూనిట్ సబ్యులకు లేఖ ద్వారా విషెస్ అందించడమే కాకుండా స్పెషల్ గా ప్యాక్ చేసి ఈ గిఫ్ట్ ను పంపారు మెగాస్టార్.


Click it and Unblock the Notifications











