చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా సర్జా

కన్నడ హీరో చిరంజీవి సర్జా మరణించడం, అతని మృతి పట్ల మేఘనా రాజ్ సర్జా ఎంతగా ఎమోషనల్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, చనిపోయే సమయానికి గర్భవతిగా ఉండటం, కనీసం పుట్టే బిడ్డను కూడా చూడకుండా కన్నుమూశాడని మేఘనా కన్నీరుమున్నీరైంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయినా మేఘనా సోషల్ మీడియాలో చిరంజీవి సర్జాను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ తన భావాలను వ్యక్త పరిచేది.

చిరంజీవి సర్జా మరణం..

చిరంజీవి సర్జా మరణం..

చిరంజీవి స‌ర్జా(39) జూన్ 7న గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం, వైద్యులు అందించిన చికిత్సకు రియాక్ట్ కాకపోవడంతో తుది శ్వాస విడిచాడు. ఇక భర్త మరణంతో మేఘన శోకసంద్రంలో మునిగింది.

గర్భవతిగా ఉన్న భార్య..

గర్భవతిగా ఉన్న భార్య..

చిరంజీవి స‌ర్జా మేఘ‌నా రాజ్‌‌లు ప్రేమించి పెళ్లి (2018 మే 2) చేసుకున్నారు. చిరు మరణించే సమయానికి ఆమె గ‌ర్భ‌వ‌తిగా ఉంది. ఇక పుట్టే బిడ్డలోనే తనను చూసుకుంటానని, మళ్లీ తిరిగి బిడ్డలా పుట్లాలని కోరుకుంది. ఆమె కోరుకున్నట్టుగానే చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు.

సీమంతం వేడుకల్లో..

సీమంతం వేడుకల్లో..

మేఘన తన సీమంతం వేడుకల్లో చిరంజీవి సర్జాను పక్కనే పెట్టుకుంది. చిరంజీవి కటౌట్‌ను పక్కనే పెట్టుకుని, భర్త పక్కనే ఉన్నాడని ఊహించుకుని సీమంతం వేడుకలను నిర్వహించింది. భర్తపై ఉన్న ప్రేమను చాటిన మేఘన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మేఘనకు పండంటి బిడ్డ పుట్టాడు.

Recommended Video

#Hyderabad Floods Tollywood Heros Huge Donations హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్.విరాళాలు
ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

చిరంజీవి సర్జా తమ్ముడు ధృవ్ సర్జా పుట్టిన పిల్లవాడిని ఎత్తుకుని మళ్లీ మా అన్న పుట్టాడని సంబరపడిపోయాడు. చిరంజీవి సర్జా ఫోటో దగ్గర అప్పుడే పుట్టిన పసికందును ఫోటోను చూసిన నెజిటన్లు ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికి మళ్లీ జన్మించి భార్య కోరికను తీర్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X