నీకు నచ్చినట్టుగానే ప్రతీ రోజూ గడుపుతున్నాం.. చిరంజీవిపై మేఘన ఎమోషనల్ పోస్ట్
కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా గత నెల (జూన్ ) మరణించిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో చిరంజీవి మరణించిన నెలరోజులు అవుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు చేరారు. చిరంజీవి సర్జాకు సంబంధించిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులందరూ చిరునవ్వులు చిందించారు. చిరంజీవి లేని లోటును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్అయ్యారు. ఈ మేరకు భార్య మేఘనా సర్జా ఓ పోస్ట్‌తో అందర్నీ కంటతడి పెట్టించింది.

గుండెపోటుతో..
చిరంజీవి సర్జా(39) జూన్ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. చిరు మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

బిడ్డను చూసుకోకుండానే..
బెండు అప్పారావ్ సినిమాతో తెలుగులో మేఘనా ఎంట్రీ ఇచ్చింది. ఆపై కన్నడలో ఎన్నో చిత్రాలు చేసింది. అక్కడే చిరంజీవి సర్జా, మేఘనల మధ్య ప్రేమాయణం కొనసాగింది. 2018 మే 2న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. అయితే చిరు తన సంతానాన్ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

భర్తను తలుచుకుంటూ..
భర్తను తలుచుకుంటూ మేఘన కుమిలిపోయింది. తన పోస్ట్‌లతో, భావాలతో నెటిజన్లను కన్నీరు పెట్టించింది. భర్త జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తన బిడ్డగా మళ్లీ ఈ లోకంలోకి రావాలని కోరుకుంది. ‘నా శ్వాస ఉన్నంత వరకు నువ్ బతికే ఉంటావు.. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా చిరంజీవి సర్జా మరణించి నెల అవుతున్న సందర్భంగా మరో పోస్ట్ చేసింది.
Recommended Video

నీకు నచ్చినట్టుగానే..
నా ప్రియమైన చిరు.. చిరు అంటే ఓ పండగ.. ఎప్పటికీ అది ఓ సెలెబ్రేషనే. అయితే నీకు ఇలాంటివి నచ్చవనీ నాకు తెలుసు.. నా నవ్వుకు కారణం చిరు.. అతడు నాకు ఏం ఇచ్చాడో అది నాకెంతో విలువైంది..నా కుటుంబం.. మేము అంతే.. మేము ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాము బేబీ మా.. నీకు నచ్చినట్టే ప్రతీ రోజు గడుపుతాము.. ప్రేమ, నవ్వులు, ప్రాంక్స్, నిజాయితీ.. అన్నింటి కంటే ముఖ్యమైంది.. కలిసికట్టుగా జీవించడం.. మేమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము బేబీ మా' అని ఓ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











