పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది.. మాల్దీవుల్లో మెహ్రీన్ మాయచేస్తోంది!!
మెహ్రీన్‌కు అందం ఉంది అదృష్టం కూడా ఉంది. అందుకే సినిమాలు హిట్ కాకపోయినా ఆఫర్స్ వస్తున్నాయి. మెహ్రీన్ తన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాథలోనే తన ప్రతిభను చూపించింది. అందులో మాత్రమే నటించినట్టు కనిపించింది. మిగతా ఏ సినిమాలో కూడా మెహ్రీన్ అంతగా నటించలేదు. సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఆర్టిస్ట్ అంటూ మెహ్రీన్‌ను ట్రోల్ చేసేవారు. అయితే ఎఫ్2 చిత్రంతో మెహ్రీన్ మంచి సక్సెస్ కొట్టింది.

అలాంటి రూమర్లు..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ రెండు సినిమాలు చేసింది. రాజా ది గ్రేట్ సినిమా హిట్ అయినా కూడా మెహ్రీన్ నటన మైనస్ అయింది. అయినా కూడా మళ్లీ వెంటనే ఎఫ్ 2 సినిమాలో చాన్స్ ఇచ్చాడు. కామెడీ పాత్రలో మెహ్రీన్ బాగానే నెట్టుకొచ్చింది. ఇలా వెంటవెంటనే చాన్సులు ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లు వచ్చాయి.

ఆ గొడవతో..
తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా ప్రమోషన్స్‌కు రావాలని నిర్మాత, హీరో తండ్రి బలవంత పెట్టాడని మెహ్రీన్ చెప్పింది. ఆ గొడవలో హోటల్ బిల్లులు, ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ అంటూ వచ్చిన రూమర్లపై మెహ్రీన్ స్పందించింది. తానే హోటల్ బిల్లులు కట్టుకున్నానని, నా స్టాఫ్‌కు కూడా నేనే ఇచ్చుకున్నాని వివరణ ఇచ్చింది.

తాజాగా అలా..
మెహ్రీన్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అదేంటో గానీ ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ మాల్దీవులకే చెక్కేస్తున్నారు. హనీమూన్, బర్త్ డే సెలెబ్రేషన్స్, వెకేషన్స్ ఇలా ఈవెంట్ ఏదైనా సరే అందరూ మాల్దీవుల్లోనే మకాం వేస్తున్నారు. మెహ్రీన్ కూడా తన బర్త్ డే సందర్భంగా మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
Recommended Video

పొట్టి బట్టల్లో రచ్చ..
తాజాగా మెహ్రీన్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. పొట్టి డ్రెస్సు ధరించి కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. మెహ్రీన్ తన అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో మంట పెడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











