క్రేజీ హీరోపై క్యాస్టింగ్ కౌచ్ కుట్ర.. హీరోయిన్ ఆరోపణలు.. భారీ డబ్బు ఆఫర్

సినీ పరిశ్రమలోనైనా హీరోలను లేదా హీరోయిన్లను తొక్కేయడానికి కుట్రలు జరగడం చాలా సాధారణమైన విషయమే. తమకు స్టార్ హోదాకు ముప్పు ఉందంటే ఎంతకైనా తెగిస్తారనే వాదనలు గతంలోనూ వినిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమను లైంగిక వేధింపులు విషయం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని ఓ హీరోపై బురద జల్లేందుకు భారీ కుట్ర జరిగినట్టు ముంబై మీడియాలో సంచలన కథనం వెలువడింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోను టార్గెట్ చేసుకొని

బాలీవుడ్ హీరోను టార్గెట్ చేసుకొని

బాలీవుడ్‌లో ఓ హీరోను టార్గెట్ చేసుకొని ఆయన ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నాలు జరిగాయట. అందుకోసం ఓ క్రేజీ హీరోయిన్‌ను ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయట. అయితే ఆ హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు అనే విషయాలను మీడియా కథనంలో గుంభనంగా ఉంచారు. అయితే ఆ హీరోయిన్ గురించి మాత్రం కొన్ని క్లూస్ వదిలారు.

100 కోట్ల హీరోయిన్‌తో

100 కోట్ల హీరోయిన్‌తో

ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన చిత్రంలో ఆ హీరోయిన్ నటించింది. 2018లో రిలీజైన ఆ చిత్రం రూ.100 కోట్లను ఆమె చిత్రం రాబట్టింది. అలాంటి హీరోయిన్‌తో సంప్రదింపులు జరిపారు. సెలబ్రిటీ టాక్ షోలో సదరు హీరోపై లైంగిక ఆరోపణలు చేస్తే భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్దమని ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టు కథనంలో పేర్కొన్నారు.

హీరోపై ఆరోపణలు చేయను

హీరోపై ఆరోపణలు చేయను

నేను సెలబ్రిటీ టాక్ షోలో ఆ హీరోకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేయను. నాకు అలాంటి ఆలోచన, ఆశ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిపై కామెంట్ చేయడానికి నేను సిద్దంగా లేను అని సదరు హీరోయిన్ కొందరికి ఝలక్ ఇచ్చిందట. దాంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రముఖులు జారుకొన్నారట. ఆ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావొచ్చనే మాట వినిపిస్తున్నది.

సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు

సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు

బాలీవుడ్‌నే కాకుండా అన్ని భాషల్లో సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. నానా పాటేకర్‌పై తనుశ్రీ దత్తా, వైరముత్తుపై చిన్మయి, ఇతర మహిళలు, అలాగే అర్జున్ సర్జాపై శృతిహరిహరన్ తదితరులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేయడం సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X