For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానా, అనుష్క మధ్య ఆ రిలేషన్ ఉందా? హీరోయిన్ పోస్టుతో బయటపడిన బంధం!

  By Manoj Kumar P
  |

  టాలీవుడ్‌లో అద్భుమైన నటిగా గుర్తింపును తెచ్చుకుని చాలా కాలం టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అనుష్క శెట్టి. అదే సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా... తనలోని టాలెంట్ చూపించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ హంక్ రానా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి రానా, అనుష్క స్నేహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ చేసిన ట్వీట్‌తో రానా, అనుష్క మధ్య ఉన్న రిలేషన్ బయట పడింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

  ఐదేళ్లు కలిసున్నారు.. ఇలా ఫిక్స్ అయ్యారు

  ఐదేళ్లు కలిసున్నారు.. ఇలా ఫిక్స్ అయ్యారు

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘బాహుబలి'. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రానా, అనుష్క ఐదేళ్లు కలిసి పని చేశారు. ఈ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య బంధం బలమైంది. అది ఇప్పటి వరకూ కొనసాగుతోంది. వీళ్లిద్దరి స్నేహం గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తెలుసు.

  ప్రభాస్‌తో అనుష్క డేటింగ్.. రానాతో లింక్

  ప్రభాస్‌తో అనుష్క డేటింగ్.. రానాతో లింక్

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మధ్య ప్రేమాయణం సాగుతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో వీళ్లిద్దరి మధ్య రానా మీడియేటర్‌గా పని చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.

  అనుష్క సైలెంట్‌గా.. రానా మాత్రం వైల్డ్‌గా

  అనుష్క సైలెంట్‌గా.. రానా మాత్రం వైల్డ్‌గా

  ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, రానా ‘హాతీ మేరా సాతి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. దీనితో పాటే ‘విరాటపర్వం' అనే సినిమానూ చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.

  Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
   ప్రేమలో పడ్డ రానా.. స్వయంగా ప్రకటన

  ప్రేమలో పడ్డ రానా.. స్వయంగా ప్రకటన

  టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా ప్రేమలో పడ్డాడు. పలువురు హీరోయిన్లతో అతడు డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలోనే... తాజాగా తన ప్రేయసి గురించి వివరించాడు. మిహికా బజాజ్ అనే యువతినే రానా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలియజేయడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

  శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు

  టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన రానా దగ్గుబాటి ప్రేమలో పడినట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అతడికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీలు సైతం రానా, మిహికాకు కంగ్రాట్స్ చెబుతూ.. పెళ్లి కబురు కోసం వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు.

  రానా, అనుష్క మధ్య ఆ రిలేషన్ ఉందా?

  రానా, అనుష్క మధ్య ఆ రిలేషన్ ఉందా?

  దగ్గుబాటి రానా తన ప్రేమను వ్యక్త పరిచిన సందర్భంగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. రానాను ఆమె బ్రదర్ అని సంబోధించడమే. ఆమె చేసిన పోస్టుతో ఇన్ని రోజులూ స్నేహితులుగా చెప్పుకుంటున్న ఈ ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ రిలేషన్ ఉందని అర్థమైంది.

  English summary
  Nishabdham is an upcoming Indian thriller film directed by Hemant Madhukar. The film starring Anushka Shetty as lead role alongside Madhavan, Anjali, Michael Madsen, Subbaraju, Shalini Pandey and Srinivas Avasarala in supporting roles. This film was simulataneously shot in Telugu and Tamil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X