రానా దగ్గుబాటి పెళ్లికి అరుదైన గుర్తింపు.. సెన్సేషన్ అంటూ ఫన్నీ కార్టూన్‌తో అమూల్ కేక!
ఏదైనా గొప్ప సంఘటనలు జరిగినప్పుడు, స్పెషల్ ఈవెంట్లు చోటుచేసుకొనేటప్పుడు అమూల్ పాల ఉత్పత్తుల సంస్థ హాస్యం ఉట్టిపడే కార్టూన్స్‌తో ఆకట్టుకోవడం అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భళ్లాల దేవుడిగా గుర్తింపుపొందిన రానా దగ్గుబాటి తాజాగా తన ప్రియురాలు మహిక బజాజ్‌ను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. రానా, మిహిక వివాహం నేపథ్యంలో తనదైన శైలిలో అమూల్ స్పందించింది.

రానా, మిహిక పెళ్లిపై అమూల్
రానాదగ్గుబాటి, మిహిక బజాజ్ పెళ్లికి అమూల్ అరుదైన గుర్తింపునిచ్చింది. ఎప్పుడూ డూడుల్స్‌తో ఆలరించే అమూల్ కంపెనీ వారి పెళ్లిపై ఓ కార్టూన్‌ను ప్రచురించింది. దగ్గుబాటి ఇంటి పేరు కలిసి వచ్చేలా ది దగ్గుబటర్లీ వెడ్డింగ్ (The Daggubutterly wedding!) అంటూ చమత్కరించింది. రానా.. యే ఖానా (Rana, yeh khana_ అంటూ అమూల్ బట్టర్‌ను చూపించింది. నవ దంపతులు రానా, మిహిక కలిసి బటర్ తింటున్న కార్టూన్‌ను ప్రచురించింది.

రానా పెళ్లి ఇంటర్నెట్ సెన్సేషన్ అంటూ
రానా, మిహికా పెళ్లి సందర్భంగా రూపొందించి కార్టూన్‌ను అమూల్ సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేసింది. అమూల్ టాపికల్: ది రానా, మిహికా షాదీ అంటూ వారి పెళ్లిని ఇంటర్నెట్ సెన్సేషన్‌గా అభివర్టించింది. రానా, మిహికలకు తమ జనరంజకమైన కార్టూన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అమూల్ కార్టూన్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది.

అమూల్‌కు థ్యాంక్యూ చెప్పిన రానా
తమ పెళ్లికి సంబంధించిన అమూల్ కార్టూన్‌ను చూసిన రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో స్పందించారు. తమ పెళ్లిపై కార్టూన్‌ను ప్రచురించినందుకు థ్యాంక్యూ అంటూ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా మారిన భళ్లాలదేవుడు బదులిచ్చారు. ఇక రానా కార్టూన్‌పై స్పందించడంతో ఆయన అభిమానులు కూడా ప్రశంసలు, కామెంట్లతో హడలెత్తించారు.
Recommended Video

ఆగస్టు 8న నిరాడంబరంగా వివాహం
రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా కేవలం 30 మందికి మించకుండా వివాహ వేడుకను జరిపించారు. పెళ్లి అనంతరం రానా, మిహిక పెళ్లి ఫోటోలు, కుటుంబం మొత్తం కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











