For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Miss Universe 2021 చరిత్ర సృష్టించిన హర్నాజ్.. విశ్వ సుందరి పోటీల్లో ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

  |

  ప్రపంచ అందాల పోటీ‌లో భారతీయ యువతి విశ్వ సుందరిగా ఎంపికై కీర్తీ పతాకాన్ని ఎగురువేసింది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచారు. భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా రికార్డును సొంతం చేసుకొన్నది. విశ్వసుందరిగా గెలిచిన హర్నాజ్ ప్రయాణం గురించి మరిన్నీ వివరాల్లోకి వెళితే..

  పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్మించి

  పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్మించి

  పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్నించిన హర్నాజ్ సంధూ గురు‌హర్‌సహాయ్‌లో పుట్టి పెరిగింది. పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడే ప్రతిభ కలిగిన హర్నాజ్ సంధూ కాలియా పబ్లిక్ స్కూల్, ప్రోస్ట్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకొన్నారు. ఆ తర్వాత మోడలింగ్, అందాల పోటీల్లో పాల్గొంటూ 2019 ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచారు.

   80 మంది అందాల భామలతో పోటీ పడి

  80 మంది అందాల భామలతో పోటీ పడి

  ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మొత్తం 80 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ పోటీల్లో మొదట టాప్ 16లో చోటు సంపాదించారు. ఆ తర్వాత ఈ ఈ పోటీల్లో ఎదురు చూసుకొన్న దాఖలాలు లేవు. అనంతరం టాప్ 5, టాప్ 3 జాబితాలో చోటు సంపాదించారు. టాప్ 3లో హర్నాజ్ సంధూతోపాటు పరాగ్వే, సౌతాఫ్రికా అందాల భామలు గట్టిపోటీ ఇచ్చారు.

   ఆత్మ విశ్వాసం, భావావేశమే శ్రీరామరక్ష

  ఆత్మ విశ్వాసం, భావావేశమే శ్రీరామరక్ష

  మిస్ యూనివర్స్ 2021 ఫైనల్ పోటీకి ముందు యువతపై అతిపెద్ద ఒత్తిడి ఏమిటి అని న్యాయనిర్ణేత అడిగిన ప్రశ్నకు హర్నాజ్ చాలా కాన్ఫిడెన్స్‌గా సమాధానం ఇస్తూ.. యువత వారిలోని మనోధైర్యాన్ని నమ్మడానికి ఇబ్బందులు పడటం అతిపెద్ద ఒత్తిడి. మీరు విభిన్నమైన వ్యక్తి అని.. అదే మీకు అందమైన జీవితాన్ని ప్రసాదిస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎదుటివారితో మీరు పోల్చుకోవడం ఆపితే.. ప్రపంచంలోని అనేక విషయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయలు చెప్పవచ్చు. మీలోని భావావేశాన్ని బయటపెట్టండి. అదే మీకు శ్రీరామరక్షగా నిలిచి మిమ్మల్ని లీడర్‌గా మారుస్తుంది. మీ సొంత అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పండి. నేను నన్ను నమ్ముకొన్నాను కాబట్టే.. ఈ రోజు ఇలాంటి విజయంతో మీ ముందు నిలుచున్నాను అంటూ హర్నాజ్ సంధూ చెప్పారు.

  మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 చేతుల మీదుగా

  మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 చేతుల మీదుగా

  మిస్ యూనివర్స్ 2021 అందాల పోటీల్లో పలు విభాగాల్లో మెరుగైన ప్రతిభను చాటుకొన్న హర్నాజ్ సంధూను చివరకు విశ్వసుందరి కిరీటం వరించింది. హర్నాజ్‌కు మాజీ విశ్వసుందరి, మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా ప్రేక్షకులు, నిర్వాహకులు, తోటి కంటెస్టెంట్ల జయజయధ్వానాల మధ్య కిరీటం తొడిగింది. దాంతో హర్నాజ్ కౌర్ సంధూ విశ్వ సుందరిగా నిలిచింది.

   ప్రైజ్ మనీ ఎంతంటే..

  ప్రైజ్ మనీ ఎంతంటే..

  విశ్వ సుందరిగా నిలిచిన హర్నాజ్‌ కౌర్ సంధూకు భారీగా ప్రైజ్ మనీ దక్కింది. బహుమతులు, స్పాన్సర్ ఇచ్చే గిప్టులతో కలిపి విజేతగా హర్నాజ్‌ మొత్తం 2 కోట్ల రూపాయల వరకు సొంతం చేసుకోనున్నారు. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆఫర్లు కూడా ఆమెను వరించే అవకాశం ఉంది. ఒకే దెబ్బతో కోటీశ్వరాలిగా హర్నాజ్ మారిపోయారు.

  సుస్మిత సేన్, లారా దత్తా తర్వాత మూడో బ్యూటీగా

  సుస్మిత సేన్, లారా దత్తా తర్వాత మూడో బ్యూటీగా

  విశ్వ సుందరి 2021గా ఎంపికైన హర్నాజ్ కౌర్ సంధూ ఈ ఘనతను సాధించిన తొలి సిక్కు యువతిగా మరో రికార్డును సాధించింది. అలాగే సుస్మితా సేన్, లారా దత్తా తర్వాత మూడో భారతీయ సుందరిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. లారా దత్తా 2000 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపిక కాగా, సుస్మిత సేన్ 1994లో మిస్ యూనివర్స్‌గా నిలిచింది.

  Recommended Video

  Harnaaz Sandhu Miss Universe 2021 Journey || Filmibeat Telugu
  బాలీవుడ్‌ రెడ్ కార్పెట్

  బాలీవుడ్‌ రెడ్ కార్పెట్

  ఇక విశ్వసుందరిగా మారడానికి ముందే హర్నాజ్ కౌర్ సంధూకు బాలీవుడ్ వర్గాలు రెడ్ కార్పెట్ పరిచింది. విశ్వ సుందరిగా మారిన తర్వాత భారీ ఆఫర్లను హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాత, దర్శకులు ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఏ బాలీవుడ్ నిర్మాత ఆఫర్‌ను ఎలా దక్కించుకొంటుందో వేచి చూడాల్సిందే. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Miss Diva 2021 Harnaaz Kaur Sandhu crowned Miss Universe 2021. The competition was held on 12 December 2021 in Eilat, Israel. Harnaaz Kaur Sandhu was presented the crown by Andrea Meza, former Miss Universe 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X