విగ్నేషుని కథతో ఆకట్టుకున్న మోహన్ బాబు.. వీడియో వైరల్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి దైవ భక్తి ఏ రేంజ్ లో ఉంటుందో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచు వారి ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు తప్పకుండా ఆహ్వానం అందుతుంది. మోహన్ బాబుకు అత్యంత సన్నిహితులు మంచు వారి ఇంట ఎలాంటి శుభకార్యాలు జరిగినా వస్తుంటారు. అయితే ఆయనకు ఇష్టమైన పండగాల్లో వినాయకచవితి ఒకటి.
సాధారణంగా ప్రతి ఏడాది మోహన్ బాబు వినాయకచవితి సందర్భంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సినీ ప్రముఖులను సన్నిహితులను పిలిచి ఆయనే స్వయంగా విఘ్నేశ్వరుని కథను చెబుతుంటారు. అయితే ఈ సారి కరోనా వైరస్ కారణంగా అలాంటి వేడుకలకు దూరం కావాల్సి వస్తోంది. అందుకే మోహన్ బాబు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్ట్ గా యూ ట్యూబ్ ద్వారా అందరికి ఆయన విగ్నేషుని కథను వినిపిస్తున్నారు.

మంచు విష్ణు తనను ప్రత్యేకంగా ఈ విగ్నేషుని కథను యూ ట్యూబ్ ద్వారా చెప్పాలని కోరినట్లు మొహన్ బాబు వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో మోహన్ బాబు విగ్నేషుని కథను ఎంతో భక్తి శ్రద్ధలతో వివరించారు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇతర ఫిల్మ్ స్టార్స్ కూడా చాలా బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మోహన్ బాబు నుంచి సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా రానుంది. అలాగే తమిళ్ హీరో సూర్య నటించిన ఆకాశ వీధిలో కూడా మోహన్ బాబు ఒక ముఖ్య పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











