నువ్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీనే.. అఖిల్‌పై మోనాల్ ప్రేమ
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. నాల్గో సీజన్‌లో ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎవరి గ్యాంగ్ వారిదే అన్నట్టుగా మారిపోయింది. ఎన్నో ట్రాకులు ఏర్పడ్డాయి. ఎందరో పులిహోర రాజాలు వచ్చారు. అయితే చివరకు మాత్రం నిలిచింది అఖిల్ మోనాల్ జంటే. ఈ ఇద్దరి మధ్యే ఏదో తెలియన బంధం నడుస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ షోలో అలా..
బిగ్ బాస్ షోలో ఈ ఇద్దరి వ్యవహారం ఎవ్వరికీ సరిగ్గా అర్థం కాదు. ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు, మనస్పర్థలు, నామినేషన్ చేసుకోవడం మళ్లీ వెంటనే దగ్గరవ్వడం, టాస్కులు వస్తే దూరం పెట్టడం ఇలా ఎన్నెన్నో విధాలుగా వ్యవహారం మలుపులు తిరుగుతూ ఉండేది.

ఇద్దరూ ఒక్కటిగా..
మొత్తానికి చివరకు ఈ ఇద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. బయటకు వచ్చిన మోనాల్ మరింతగా మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అలా అఖిల్ కోసం మోనాల్ ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంది. బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరి మధ్య బంధం మరింతగా బలపడింది.

ఇద్దరి రొమాన్స్..
మోనాల్ అఖిల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్‌ను మిగతా షోలు బాగానే వాడుకుంటున్నాయి. ఈ ఇద్దరూ కూడా బుల్లితెరపై రెచ్చిపోయి మరీ రొమాన్స్‌ను పండిస్తున్నారు. బిగ్ బాస్ ఉత్సవం, కామెడీ స్టార్స్ వంటి షోల్లోమోనాల్ అఖిల్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

తాజాగా ఇలా..
తాజాగా అఖిల్ కింగ్ నాగార్జునను కలిశాడు. ఈ క్రమంలో అఖిల్ ఆనందంలో తేలిపోయాడు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుక నాటి రోజులను గుర్తు చేసినందుకు, అభినందించినందుకు థ్యాంక్స్ అంటూ నాగార్జునపై తన ప్రేమను చాటుకున్నాడు అఖిల్.

నువ్ హ్యాపీ. నేను హ్యాపీ..
నాగార్జునను కలవడంతో అఖిల్ ఎంతో హ్యాపీగా ఉన్నాడని అర్థమవుతోంది. అయితే ఇలా అఖిల్ సంతోషంగా ఉండటంపై మోనాల్ కామెంట్ చేసింది. నువ్ హ్యాపీగా ఉండటం చూస్తుంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను అంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











