RRR విడుదల మరోసారి వాయిదా: ఆ రెండు సినిమాల అప్‌డేట్‌తో కన్ఫార్మ్.!

By Manoj Kumar P

RRR.. దాదాపు రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోన్న సినిమా. దీనికి కారణం... ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండడానికి తోడు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్‌ కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR మరోసారి వాయిదా పడిందన్న వార్త షాక్‌కు గురి చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

రియల్ హీరోల కథతో స్టార్ హీరోలు

రియల్ హీరోల కథతో స్టార్ హీరోలు

‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

మళ్లీ అదే రేంజ్.. అందుకే వాళ్లంతా

మళ్లీ అదే రేంజ్.. అందుకే వాళ్లంతా

తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో రూపొందుతోన్న సినిమా RRR. అన్ని భాషల్లో సినిమాకు క్రేజ్ పెంచేందుకు ఆయా ఇండస్ట్రీల నుంచి కీలక నటులను ఇందులో తీసుకున్నాడు జక్కన్న. అలాగే, కథ ప్రకారం... హాలీవుడ్‌కు చెందిన నటులను పెట్టుకున్నాడు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను సైతం ఈ మూవీ కోసం వాడుతున్నారు.

చాలా పూర్తయింది.. అదే మిగిలింది

చాలా పూర్తయింది.. అదే మిగిలింది

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. అయినప్పటికీ... షూటింగ్ మాత్రం దాదాపు డెబ్బై ఐదు శాతం వరకే పూర్తయింది. మిగిలిన దానిలో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటితో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేయాల్సిన కొన్ని సన్నివేశాలు కూడా బాకీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 మాట తప్పిన యూనిట్.. వాయిదా

మాట తప్పిన యూనిట్.. వాయిదా

వాస్తవానికి ఈ సినిమా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ప్రెస్‌మీట్‌లో RRRను జూలై 30, 2020న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కానీ, నటీనటుల గాయాలు, వాతావరణం అనుకూలించకపోవడం, డేట్స్ అడ్జట్స్ కాకపోవడం వంటి కారణాలతో షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ మూవీని జనవరి 8, 2021న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

RRRకు భారీ దెబ్బ.. జక్కన్నకే షాక్

RRRకు భారీ దెబ్బ.. జక్కన్నకే షాక్

రెండోసారి చెప్పిన సమయానికైనా సినిమాను విడుదల చేయాలని RRR యూనిట్ పట్టుదలతో పని చేసింది. అలాంటి సమయంలో కరోనా రూపంలో మరో ఆటంకం ఎదురైంది. దీంతో ఈ మూవీ షూటింగ్ సుదీర్ఘ కాలం పాటు వాయిదా పడిపోయింది. ఇదిలాఉండగా, చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అంతా షాక్ అయ్యారు.

RRR విడుదల మరోసారి వాయిదా

RRR విడుదల మరోసారి వాయిదా

ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ పంజా విసురుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగులు చాలా రోజుల పాటు జరిగే అవకాశం లేదు. దీంతో RRR విడుదల మరోసారి వాయిదా పడుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల అప్‌డేట్‌తో దీనిపై క్లారిటీ వచ్చేసింది.

Recommended Video

Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
ఆ రెండు సినిమాల అప్‌డేట్‌తో కన్ఫార్మ్.!

ఆ రెండు సినిమాల అప్‌డేట్‌తో కన్ఫార్మ్.!

అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి అని ఉంది. అలాగే నితిన్ కొత్త సినిమా ‘రంగ్ దే' టీజర్‌లోనూ పొంగల్‌కు వస్తున్నట్లు తెలిపారు. RRR వాయిదా పడడం ఖాయమని తెలవడం కారణంగానే ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X