2020లో ఎక్కువ మంది లైక్ చేసిన ట్రైలర్లు: ఇందులోనూ ఆ హీరోదే హవా.. మెగా హీరోలవి రెండు!

గతంతో పోలిస్తే 2020లో విడుదలైన సినిమాలు చాలా తక్కువ. దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి నెలాఖరు నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఆగిపోయాయి. కొందరు నిర్మాతలు ధైర్యం చేసి ఓటీటీల్లో విడుదల చేసినప్పటికీ.. అవేమీ పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఇక, ఈ ఏడాది విడుదలైన కొన్ని చిత్రాల్లోనే ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇక, 2020 పూర్తవుతోన్న సందర్భంగా ఈ సంవత్సరం ఎక్కువ మంది లైక్ చేసిన ట్రైలర్ల జాబితాను ఓ సారి చూద్దాం!

సరిలేరు అనిపించుకున్న మహేశ్ బాబు

సరిలేరు అనిపించుకున్న మహేశ్ బాబు

అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే, 2020లో ఎక్కువ మంది లైక్ చేసిన ట్రైలర్ల జాబితాలో ఇది ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ మొత్తంగా 6.14 లక్షల లైకులు సాధించింది.

‘అల' రికార్డులు క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్

‘అల' రికార్డులు క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఇది కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ ఈ ఏడాది టాప్ మూవీగా నిలిచింది. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే.. అల.. వైకుంఠపురములో ట్రైలర్ 5.5 లక్షల పైచిలుకు లైకులు అందుకుని ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.

 ఓటీటీలో విడుదలైనా.. సత్తా చాటిన నాని

ఓటీటీలో విడుదలైనా.. సత్తా చాటిన నాని

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన చిత్రం ‘V'. లాక్‌డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, లాభాలు అందుకుని సత్తా చాటింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల లైకులు వచ్చాయి. దీంతో ఇది మూడో స్థానంలో నిలిచింది.

తెలుగులో ఫేమస్ కాకున్నా.. ఇక్కడ ఇలా

తెలుగులో ఫేమస్ కాకున్నా.. ఇక్కడ ఇలా

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విజయ్ అభిమానులకు సైతం నచ్చలేదు. అయితే, దీని ట్రైలర్‌కు 3 లక్షల లైకుల రావడంతో నాలుగో స్థానం దక్కింది.

అక్కడ సూపర్ హిట్.. ఇందులో కూడా సత్తా

అక్కడ సూపర్ హిట్.. ఇందులో కూడా సత్తా

వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘భీష్మ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ మొత్తంగా 2.28 లక్షల లైకులు సాధించింది. ఫలితంగా ఐదో స్థానాన్ని అందుకుంది.

 సోలోగా వచ్చి సత్తా చాటిన సాయి ధరమ్

సోలోగా వచ్చి సత్తా చాటిన సాయి ధరమ్

సుబ్బు అనే నూతన దర్శకుడితో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్'. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌. ప్రేమ, పెళ్లి అనేవి వేస్ట్ అనే కుర్రాడి కథతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు 1.72 లక్షల లైకులు రావడంతో ఆరో స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X