మాతృదినోత్సవం.. ఎమోషనల్‌గా టచ్ చేసిన చిరు.. మహేష్ బాబు, అల్లు అర్జున్ ట్వీట్స్ వైరల్
ప్రతీచోటా దేవుడు ఉండలేడని.. అమ్మను సృష్టించారని అంటారు. అలాంటి అమ్మను గౌరవించుకోవడానికి, మనకోసం చేసిన త్యాగాలను స్మరించుకోవడానికి, తిరిగి ప్రేమను పంచుకోవడానికి మాతృదినోత్సవం అని ఓ రోజును జరుపుకుంటోంది ప్రపంచం. ప్రతీ ఏడాది మేలోని రెండో ఆదివారాన్ని ప్రపంచ మాతృదినోత్సవంగా సెలెబ్రేట్ చేసుకుంటాం. ఈ మేరకు వారి వారి మాతృమూర్తులను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో అమ్మ గొప్పదనాన్ని చాటిచెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
Recommended Video

నా జీవితంలో వెలుగు..
మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘నా జీవితంలో వెలుగులు నింపుతూ మార్గనిర్దేశం చేసిన ఇద్దరు (ఇందిరా దేవీ, నమ్రతా శిరోద్కర్), అంతేకాకుండా బయట ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు, నిత్యం వెలుగుతూ ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు.

అదే నేర్చుకున్నా..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘మన వద్ద ఎంత ఉన్నా.. సింపుల్‌గా ఎలా ఉండాలనేది నా తల్లి వద్ద నుంచి నేను నేర్చుకున్న అతి గొప్ప పాఠం. నా తల్లికే కాకుండా.. ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు' అని అమ్మతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

చిరు ఎమోషనల్ పోస్ట్..
మాతృదినోత్సవ సందర్భంగా చిరంజీవి ఓ ఎమోషన్ వీడియోను షేర్ చేశాడు. ‘మనందరి కథ వెనుక.. మన తల్లి కథ తప్పకుండా ఉంటుంది.. ఎందుకంటే మనం మొదలైంది అక్కడే కాబట్టి.. కొన్ని అద్భుతమైన ఘట్టాలు..' అంటూ అమ్మ అంజనాదేవీతో చిరు, పవన్, నాగబాబు కలిసి ఉన్న ఫోటోలను గుమ్మాడి గుమ్మాడి అనే పాట మ్యూజిక్‌తో మిక్స్ చేసి ఓ వీడియోను వదిలాడు. ఆ వీడియో హార్ట్ టచింగ్‌గా ఉండటంతో తెగ వైరల్ అవుతోంది.

సినిమాలోని పాటతో
డా : సి నా రె రాసిన ఓ పాటలోని లిరిక్స్‌ను షేర్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇంతకంటే గొప్పగా చెప్పలేమన్నట్టుగా ఓ దండం పెట్టేశాడు. ‘అమ్మను మించి దైవమున్నదా .. ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే'.


Click it and Unblock the Notifications











