twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో కొత్త వ్యాపారాలను మొదలు పెట్టిన స్టార్స్.. ఫేమ్‌తోనే బ్రాండ్ వాల్యును పెంచేస్తున్నారు

    |

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది శాశ్వతం కానిది. అందుకే స్టార్స్ వీలైనంత వరకు ట్రాక్ లో ఉండగానే సపోర్ట్ గా కొన్ని బిజినెస్ లను స్టార్ట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో హీరోల కంటే హీరోయిన్స్ ఆ దారిలో ఎక్కువగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ పై ఎంతో అవగాహన ఉండే నటిమణులైతే భారీ స్థాయిలో బిజినెస్ లను స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది స్పెషల్ గా కొంతమంది అగ్ర నటీమణులు వారికి నచ్చిన స్టైల్ లో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    2020 Recap : Celebrities Who Married In Corona Crisis | Oneindia Telugu
    సమంత సాకీ బ్రాండ్

    సమంత సాకీ బ్రాండ్

    వివిధ రకాల బ్రాండ్ లకు సంబంధించిన యాడ్స్ తో భర్త కంటే ఎక్కువ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్న సమంత ఈ ఏడాది వస్త్ర వ్యాపారం రంగంలోకి దిగింది. 'సాకీ' అనే స్పెషల్ బ్రాండింగ్ తో నేటితరం అమ్మాయిలు ఇష్టపడే డ్రెస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ బిజినెస్ బాగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

    కాజల్ కిచ్డ్ బిజినెస్

    కాజల్ కిచ్డ్ బిజినెస్

    ఇక మరో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈ ఏడాది వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడిన చందమామ రీసెంట్ గా బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది. 'కిచ్డ్' అనే బ్రాండ్ తో ఇంటీరియర్ డిజైన్స్ తో పారు వివిధ రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొని రాబోతోంది. మొన్న అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

     అలియా కూడా మొదలెట్టేసింది

    అలియా కూడా మొదలెట్టేసింది

    రీసెంట్ గా బాలీవుడ్ సుందరి అలియా భట్ కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. ఈద్-ఆ-అమ్మ పేరుతో ఫ్యాషన్ రంగంలోనే బిజినెస్ స్టార్ట్ చేసింది. చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ వివిధ రకాల డిజైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 1 నుంచి12 ఏళ్ళ వయసులో ఉన్న వారి కోసమే స్పెషల్ గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రానున్న రోజుల్లో బ్రాండ్ వాల్యును మరింత పెంచాలని అలియా ప్రయత్నాలు చేస్తోంది.

    చిన్న రౌడీ.. గుడ్ వైబ్స్

    చిన్న రౌడీ.. గుడ్ వైబ్స్

    ఇక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇటీవల బొంబాయి చట్నీ అంటూ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అతను తన స్నేహితులతో కలిసి భాగ్యనగరంలో ఇటీవల గుడ్ వైబ్స్ ఓన్లీ అనే కేఫ్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆ రెస్టారెంట్ కు మంచి క్రేజ్ అందుతోంది.

    సల్మాన్ ఖాన్ 'ఫ్రెష్' బిజినెస్

    సల్మాన్ ఖాన్ 'ఫ్రెష్' బిజినెస్

    ఇక సల్మాన్ ఖాన్ ఇప్పటికే జిమ్ సెంటర్స్, అలాగే బీయింగ్ హ్యూమన్ అనే ఫ్యాషన్ బ్రాండ్ తో వివిధ రకాల వ్యాపారాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ లో పుట్టిన సరికొత్త ఆలోచనలతో ఫ్రెష్ అనే బ్రాండ్ ను కూడా స్టార్ట్ చేశాడు. అతి తక్కువ ధరలో శానిటైజర్స్ ను అందిస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక త్వరలో ఫ్రెష్ బ్రాండ్ లో మరిన్ని వస్తువులను అందుబాటులోకి తెనున్నట్లు సమాచారం.

    English summary
    Stardom in the film industry is non-permanent. That’s why Stars start some businesses as support while on track as much as possible. Heroines are earning more that way than heroes in recent times. Especially actresses who are very knowledgeable about fashion are starting businesses on a huge scale. This year’s special features some top actresses starting businesses in the style they like. Going into those details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X