మహేష్ బాబు, గీత గోవిందం గురించి కేసీఆర్ కూతురు ఆసక్తికర కామెంట్!
Recommended Video

తెలంగాణ సీఎం కూతురు అయినప్పటికీ... ఎంపీగా, జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కవితను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సుమ... ఈ పొలిటీషియన్ నుండి సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం రాబట్టారు. సినిమాలను ఇష్టంగా చూస్తానని, రొటీన్ కమర్షియల్ సినిమాలు తనకు నచ్చవని ఈ సందర్బంగా కవిత తెలిపారు. మహేష్ బాబు గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

అ! మూవీ బాగా నచ్చింది
సినిమాలను ఇష్టంగా చూస్తానని, వైవిధ్యంగా ఉండే చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని ఎంపీ కవిత వెల్లడించారు. ఇటీవల కాలంలో తాను చూసిన ‘అ!' ఎంతో నచ్చిందని, కాన్సెప్టు, చిత్రీకరించిన విధానం ఆకట్టుకుందన్నారు.

‘గీత గోవిందం' సినిమా గురించి
ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘గీత గోవిందం' చిత్రం గురించి కూడా కవిత ప్రస్తావించారు. ఈ చిత్రం తనకు ఎంతో నచ్చిందని, ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా చిత్రీకరించిన తీరు బావుందన్నారు.

హాలీవుడ్ తరహా మూవీలు రావాలి
హాలీవుడ్ తరహాలో విభిన్నమైన సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్టులు తెలుగులో రావాలని, ఒకప్పటిలా రెగ్యులర్ సినిమాలు మాత్రమే కాకుండా వైవిధ్యం ఉన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఇటీవల కొన్ని సినిమాలు రుజువు చేశాయని కవిత తెలిపారు.

ఆ పాటలేంటి మమ్మీ అని మా అబ్బాయి అడిగేవాడు
కొన్ని తెలుగు సినిమాల మధ్యలో సడెన్‌గా పాటలు వస్తాయి, కథ ఇక్కడ జరిగితే యూరఫ్‌లో సాంగులు ఉంటాయి. అలాంటివి చూసి మా అమ్మాయి ఇపుడు ఈ పాటలేంటి అని అడిగేవాడు..... అని కవిత గుర్తు చేసుకున్నారు.

మహేష్ బాబు వెంటనే ఒప్పుకున్నారు
జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న #సిస్టర్‌ఫర్‌చేంజ్ కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని మహేష్ బాబును కోరగా ఆయన వెంటనే ఒప్పుకున్నారు. మంచి కార్యక్రమానికి మద్దతు తెలపడం ఆనందంగా ఉంది అని కవిత తెలిపారు.


Click it and Unblock the Notifications











