Lucky Baskhar: లక్కీ భాస్కర్ సినిమాపై మృణాల్ రివ్యూ.. దుల్కర్ గురించి సీత ఏమన్నదంటే?
బయట లైఫ్ లో ఆయా హీరోలు లేదా హీరోయిన్ లు తన పర్శనల్ లైఫ్ లో వేరే వేరేగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే మరికొందరు అయితే కలిసి ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బిగ్ స్క్రీన్స్ పై మాత్రం కొన్ని జంటలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఆ జంట నడుమ సినిమా వస్తుంది అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆడియెన్స్ కూడా చాలా మందే ఉంటారు.
అలా కొన్ని జంటలు సినిమాల్లో రూల్ చేస్తుంటాయి. కాగా ఈ ట్రెండ్ ఎప్పుడు నుంచో ఉండగా ఈ ట్రెండ్ లో చాలా మంది హీరో హీరోయిన్ జంటలు ఎవర్ గ్రీన్ కపుల్ గా బిగ్ స్క్రీన్ పై నిలిచారు. అలా రీసెంట్ గా తెలుగు ఆడియెన్స్ గెలుచుకున్న యువ జంట ఏదన్నా ఉంది అంటే అది మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ అనే చెప్పాలి.

కాగా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం "సీతా రామం" తెలుగులో ఎలాంటి హిట్ అయ్యిందో తెలిసిందే. కాగా ఇద్దరికీ కూడా తెలుగు ఆడియెన్స్ లో మంచి ఫేవరెట్ గా మారిపోయారు. అయితే ఈ ఇద్దరి కెమిస్ట్రీ అక్కడితో ఆగింది కానీ తర్వాత మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవడం వైరల్ గా మారాయి. దీనితో స్పెషల్ క్రేజ్ ఉన్న వీరి విషయంలో ఏ చిన్న అంశం అయినా కూడా ఈ జంట అభిమానుల్లో స్పెషల్ గానే మారుతుంది.
కాగా ఇపుడు ఇద్దరు తెలుగు సహా హిందీ ఇతర భాషల్లో వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దుల్కర్ నుంచి తెలుగులో ఇటీవల వచ్చిన సినిమానే "లక్కీ భాస్కర్". దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాపై ఇపుడు తన సీత ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.
మరి ఇన్స్టా మినహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పెద్దగా ఎంగేజ్ కాని మృణాల్ లేటెస్ట్ గా తన ఎక్స్ ఖాతా నుంచి లక్కీ భాస్కర్ సినిమాపై రివ్యూ అందించడం వైరల్ గా మారింది. "లక్కీ భాస్కర్ ఎంత రిఫ్రెషింగ్ గా ఉందో.. అంటూ ఎగ్జైట్ అవుతూ సినిమా అద్భుతంగా ఉంది.. దుల్కర్, మీనాక్షి లకి నా కంగ్రాట్స్ అలాగే చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినిమా తప్పకుండా చూడండి" అంటూ చెప్పుకొచ్చింది.
ఇలా ఆమె ఇచ్చిన రివ్యూ ఇపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారింది. దీనితో వారంతా మళ్ళీ ఒకసారి ఇద్దరినీ కలిపి ఓ సినిమా చెయ్యాలని అడుగుతున్నారు. మరి ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో కానీ తన రామ్ పై సీత ఇచ్చిన రివ్యూ మాత్రం మంచి అటెన్షన్ ని అందుకుంది. ఇక మృణాల్ రీసెంట్ గానే తెలుగులో విజయ్ దేవరకొండతో "ది ఫ్యామిలీ స్టార్" లో కనిపించింది.


Click it and Unblock the Notifications











