Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చైతూ ఇంట్లో సమంతను అలా చూసి షాకయ్యా.. ఏకంగా రెండు గంటలు అదే పని: మురళీ మోహన్
సినీ పరిశ్రమ అన్నాక.. హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు సర్వ సాధారణం. బాలీవుడ్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుండేవి. అయితే, కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ కొందరు లవ్ ట్రాక్ నడుపుతున్నారు. వీరిలో చాలా మంది వివిధ కారణాలతో తమ బంధానికి మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టేస్తుండగా... కొందరు మాత్రం దాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగ చైతన్య.. సమంత జంట ఒకటి. తాజాగా ఈ ఇద్దరి గురించి సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!
భార్య ఇష్టాలను గౌరవిస్తున్న అక్కినేని హీరో
వాస్తవానికి చైతన్యతో సమంత వివాహం జరిగిన సమయంలో ఆమె సినిమాలకు దూరం కాబోతుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, తన భార్యకు నటనపై ఉన్న ఇష్టాన్ని గౌరవించిన అక్కినేని హీరో... సినిమాల్లో కొనసాగేందుకు అంగీకారం తెలిపాడు. అప్పటి వరకు సాఫీగా సాగిన సమంత కెరీర్.. వివాహం తర్వాత ఊపందుకుని మరిన్ని సినిమాలు చేసింది.
పెళ్లి తర్వాత సమంత అలా.. నాగ చైతన్య ఇలా
మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ‘అఆ', ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘ఓ బేబీ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తమిళంలోనూ ఆమె సత్తా చాటుతోంది. అయితే, నాగ చైతన్య కెరీర్ మాత్రం సాఫీగా సాగడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.
ఇద్దరూ కలిశారు.. అదిరిపోయే హిట్ కొట్టేశారు
వరుస విజయాలతో సమంత దూసుకుపోతుండగా.. చైతన్యను మాత్రం పరాజయాలు పలకరించాయి. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ కలిసి ‘మజిలీ' అనే సినిమా చేశారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు చైతూ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీని తర్వాత ‘వెంకీ మామ'తో మరో హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో.
నాగ్ అడిగాడని చైతూకు నా ఇల్లు ఇచ్చాను
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ యాక్టర్ మురళీ మోహన్.. నాగ చైతన్య, సమంత గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మేము 14వ అంతస్థులో స్విమ్మింగ్ ఫూల్, జిమ్‌తో పాటు అన్ని సౌకర్యాలతో మూడు ఇల్లు కట్టాము. అది చైతన్యకు నచ్చి అమ్మమని అడిగాడు. నేను కుదరదంటే నాగ్‌తో ఫోన్ చేయించాడు. దీంతో ఒక దానిని అమ్మేశాను' అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
Recommended Video
చైతూ ఇంట్లో సమంతను అలా చూసి షాకయ్యా
సమంత గురించి మాట్లాడుతూ.. ‘చైసామ్ మా పక్కనే ఉంటారు. తరచూ లిప్ట్ దగ్గరో, జిమ్‌లోనో కలుస్తుంటారు. ఓ రోజు సమంత నాతో పాటు జిమ్ చేయడానికి వచ్చింది. నేను నా వర్కౌట్ కంప్లీట్ చేసి.. రెడీ అయి వచ్చినా ఆమె చేస్తూనే ఉంది. చూడ్డానికి చాలా సన్నగా ఉన్నా బరువులు ఎత్తేస్తుంటే చూసి షాకైపోయాను. ఆమె చాలా ప్రొఫెషనల్ అమ్మాయి' అని మురళీ మోహన్ వెల్లడించారు.