For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ రాజకీయాల్లో ఉన్నా నో యూజ్.. రీఎంట్రీ వెనుక రహస్యం ఇదే: సీనియర్ హీరో

  By Manoj
  |

  చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అతడు.. ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తన మార్క్ చూపిస్తూ సినిమాల్లో సత్తా చాటిన ఆయన.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికీ జనసేన అనే పార్టీ ద్వారా ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ పొలిటికల్ కెరీర్‌పై ఓ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం.!

  సినిమాల్లో సూపర్ సక్సెస్.. అక్కడ మాత్రం..

  సినిమాల్లో సూపర్ సక్సెస్.. అక్కడ మాత్రం..


  దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. అయితే, రాజకీయాల్లో మాత్రం పవన్‌కు అనుకూల ఫలితాలు రాలేదు. అప్పుడు ప్రజారాజ్యం వల్ల నష్టపోయిన ఆయనకు ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించినా అదే తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి.

  మళ్లీ మొదలు పెట్టిన పవన్.. సరికొత్తగా..

  మళ్లీ మొదలు పెట్టిన పవన్.. సరికొత్తగా..


  చాలా రోజుల పాటు రాజకీయాల్లో బిజీ బిజీగా గడిపిన పవన్ కల్యాణ్... సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్ లాయర్‌గా కనిపించనున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. బాలీవుడ్ ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే.

  వాళ్లను కూడా లైన్‌లో పెట్టేసిన పవర్ స్టార్

  వాళ్లను కూడా లైన్‌లో పెట్టేసిన పవర్ స్టార్


  ‘వకీల్ సాబ్' సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే పవన్ కల్యాణ్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో భాగంగానే క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్‌ను లైన్‌లో పెట్టేశాడు. ఇందులో క్రిష్ తెరకెక్కించే సినిమా పిరియాడిక్ జోనర్‌లో రానుండగా... హరీశ్ తీసే సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. వీటితో పాటు కొన్ని కథలను వింటున్నాడు పవన్.

  సరికొత్త ప్రయోగాలు చేస్తున్న పవన్ కల్యాణ్

  సరికొత్త ప్రయోగాలు చేస్తున్న పవన్ కల్యాణ్


  ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడు సినిమాలకు సంతకం చేసిన విషయం తెలిసిందే. వీటి కోసం ఆయన సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముందుగా ‘వకీల్ సాబ్' కోసం నేచురల్ లుక్‌తో లాయర్‌గా కనిపిస్తుండగా.. క్రిష్ మూవీలో మాత్రం విగ్గుతో దర్శనమివ్వనున్నాడట. అలాగే, ఇందులో డుయల్ రోల్ కూడా చేస్తున్నాడని టాక్. హరీశ్ మూవీలో మాత్రం స్టైలిష్ లుక్‌లో ఉంటాడని టాక్.

  పవన్ పొలిటికల్ కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్

  పవన్ పొలిటికల్ కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్

  రాజకీయాలు చూసుకుంటూనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కల్యాణ్. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పొలిటికల్ కెరీర్‌ గురించి సీనియర్ హీరో మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  అప్పుడు చిరంజీవి... ఇప్పుడు పవన్ కల్యాణ్

  అప్పుడు చిరంజీవి... ఇప్పుడు పవన్ కల్యాణ్


  సినీ ప్రముఖుల రాజకీయాల గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణిస్తారా అంటే కచ్చితంగా చెప్పలేము. అప్పుడు ఎన్టీఆర్‌కు ప్రజలు నీరాజనం పలికారు. తర్వాత చిరంజీవికి మాత్రం ప్రతికూల ఫలితాలొచ్చాయి. పవన్ కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనలో ఫైర్ ఉంది. అందుకే ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో నిలుస్తాడు' అని చెప్పుకొచ్చారు.

  Pawan Kalyan Fans Questions Tollywood Big Stars | Vijay Devarakonda
  పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నా నో యూజ్

  పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నా నో యూజ్

  పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు రావు. దానికి నాలుగేళ్ల సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్‌కు రాజకీయాలు వేస్ట్. అదే సమయంలో పార్టీకి ఆర్థిక అవసరాలు సమకూర్చుకోవాలి. అందుకోసమే ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన రెండు రంగాల్లోనూ రాణించాలని నేనూ కోరుకుంటున్నా' అని వివరించారాయన.

  English summary
  Murali Mohan Maganti is an Indian film actor, producer, politician and business executive from Telugu cinema. In 1973, Murali Mohan debuted in Jagame Maya, produced by Atluri Poornachandra Rao. He gained recognition with the 1974 film Tirupati, directed by Dasari Narayana Rao. He has acted in over 350 feature films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X