ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి క్షణాల్లో అలా అన్నారట.. కంటతడి పెట్టించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా సంగీతం ఉన్నంత కాలం ఉంటారు. తెలుగువారికి ఆయన పాట వినకుండా రోజూ కూడా గడవదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎస్పీబీకి నివాళిగా దసరా ఈవెంట్లు అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసేందుకు వస్తున్నాయి. దసరా నాడు బుల్లితెరపై వస్తోన్న ప్రతీ ఈవెంట్‌లో దాదాపు ఎస్పీబీకి నివాళిగా పాటల కార్యక్రమాన్ని పెట్టారు.

కంటతడి పెట్టిన మనో..

కంటతడి పెట్టిన మనో..


ఈటీవీలో అక్కా ఎవరో అతగాడు ఈవెంట్‌లో మనో స్పెషల్‌గా బాలు పాటలు ఆలపించాడు. సూర్యుడే సెలవని అనే పాటను పాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు. మొత్తంగా స్టేజ్ మీదే కుప్పకూలిపోయేంతగా ఏడ్చేశాడు. మనోకు ఎస్పీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

జెమినీలో అలా..

జెమినీలో అలా..


జెమినీ టీవీలో దసరా పెళ్లి చూపులు అంటూ చేయబోతోన్న కార్యక్రమంలో సింగర్ శ్రీకృష్ణ ఎస్పీబీ పాటలు పాడాడు. ఇక పోసానీ కృష్ణ మురళీ మాట్లాడుతు కంటతడి పెట్టించేశాడు. సింగర్ అంటే ఎస్పీబీ గారే అంటూ కన్నీరు పెట్టేసుకున్నాడు.

సరిగమప షోలో..

సరిగమప షోలో..

నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అంటూ జీ తెలుగులో సరిగమప అనే షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో బాగానే క్లిక్ అయింది. కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు, ఇక యశస్వీ కొండెపూడి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాటతో షో బాగానే పాపులర్ అయింది. హారికా నారాయణ్ అనే సింగర్ వల్ల షోకు గ్లామర్ టచ్ కూడా వచ్చింది.

బాలు పాటను ఆలపించగా..

బాలు పాటను ఆలపించగా..


ఎస్పీబీ పాడిన పాటను ఆలపించిన కంటెస్టెంట్లను ఉద్దేశించి కోటి కొన్ని విషయాలు చెప్పి ఎమోషనల్‌గా టచ్ చేశాడు. మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు అనే పాటను ఆలపించిన ఇద్దరు కంటెస్టెంట్లకు ఎస్పీబీ చివరి క్షణాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన బాధను చెప్పాడు.

Recommended Video

'No One Is Giving Respect To The Music Directors' Says Vintage Music Director Koti
పాడ గలనా అని అన్నారట..

పాడ గలనా అని అన్నారట..

మాటే రాని చిన్నదాని అనే పాటలో ఎస్పీబీ చివరకు శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి కోటి మాట్లాడుతూ.. చివరి క్షణాల్లో ఆ శ్వాస గురించి ఎస్పీబీ గారు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడం, ఊపిరి వచ్చేందుకు ఏదో పరికరం అమర్చుతుండగా.. నేను మళ్లీ పాడగలనా? అని డాక్టర్లతో అన్నారట. ఇలా కోటి చెప్పడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X