Muttiah Muralitharan 800 వికెట్ చేజిక్కించుకోవడం ఎంత కష్టమైందో తెలుసా? చివరి బంతి మ్యాజిక్ ఎలా జరిగిందంటే?
ప్రపంచ క్రికెట్‌లో రాణించిన ఎందరో లెజెండరీ క్రికెటర్ల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించారు. సచిన్, ధోని, అజారుద్దీన్ లాంటి గొప్ప క్రికెటర్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. అయితే అలాంటి భావోద్వేగమైన జీవిత కథతో వస్తున్న చిత్రం 800. శ్రీలంక క్రికెట్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్ వెలకట్టలేని సేవలు అందించిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. తాజాగా ఆయన జీవిత కథతో వస్తున్న 800 చిత్రం విడుదలకు ముందే ఎంతో ఎమోషన్స్‌కు మాత్రమే కాకుండా ఇంతకుముందు లేని ఆసక్తికి గురిచేస్తున్నది. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన 800 వికెట్ తీశారనే విషయంలోకి వెళితే..
బాల్యంలో ఎన్నో కష్టాలు.. :ముత్తయ్య మురళీధరన్ తన బాల్యంలో ఎవరూ చూడని కష్టాలను అనుభవించాడు. ఆర్థిక ఎన్నో సమస్యలు, పౌరుడిగా గుర్తించే విషయంలో ఎంతో వివక్ష, అవమానాలను దాటుకొంటూ క్రికెటర్‌గా రాణించే ప్రయత్నం చేశారు. క్రికెట్‌లో రాణిస్తున్న సమయంలో చెకింగ్ ఆరోపణలు ఆయనను మరింత కుంగదీశాయి. దాదాపు కెరీర్ ముగిసిందనుకొన్న సమయంలో అలాంటి పరిస్థితిని మనోధైర్యంతో ఎదుర్కొని విజేతగా నిలిచాడు.

వివక్షను దాటుకొని:శ్రీలంకలో తమిళలపై వివక్షను ఓ పంటి కింద భరిస్తూనే మరోవైపు తన కెరీర్‌ను ఎదురులేని విధంగా ప్లాన్ చేసుకోవడం ఆయన మనో నిబ్బరానికి సాక్ష్యంగా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల క్రీడా జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడు సంఘటనలను దాటుకొని 800 వికెట్లు సాధించే ప్రయాణంలో చివరి మజిలీకి చేరుకొన్నారు. 800 వికెట్ చేజిక్కుతుందా? అనే సందేహాల మధ్య చివరి టెస్ట్ ఆయన ముందుకు వచ్చింది.

మురళీధరన్ చివరి టెస్ట్:అప్పటికే ఎంతో ఖ్యాతి సంపాదించిన ముత్తయ్య మురళీధరన్ జీవితంలో చివరి టెస్ట్ వేదిక శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియం. ఇండియాతో 2010 జూలై 22వ తేదీన ఆయన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సిద్దమయ్యారు. 800 వికెట్ సాధించడానికి ఇంకా 8 వికెట్లు కావాల్సి ఉంది. ఆ చివరి టెస్ట్‌లో చరిత్ర సృష్టిస్తాడా? లేదా అనేది అందరి చూపు, ఆసక్తి పడింది.

చరిత్రకు ఒక్క వికెట్ దూరంలో :ప్రపంచ క్రీడాభిమానులు, క్రికెటర్లలో నెలకొన్న ఉద్వేగానికి అనుగుణంగా గాలె టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకొన్నాడు. ఇక 3 వికెట్లకు దూరంలో ప్రపంచ రికార్డుకు, ఎవరూ అందుకోలేని ఫీట్‌కు చేరువయ్యారు. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ముత్తయ్య 2 వికెట్లు తీసి అందరిలో ఆశలు చిగురింపజేశాడు. చరిత్రకు ఒక్క వికెట్ దూరంలో ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.

చివరి బంతి మ్యాజిక్:అయితే ముత్తయ్య మురళీధరన్ తన జీవితంలో చివరి టెస్ట్ ఓవర్, అలాగే మ్యాచ్ చివరి ఓవర్ బౌల్ చేసేందుకు బంతి చేతిలో తీసుకొన్నాడు. చరిత్ర సృష్టించడానికి 6 బంతులు.. చేజిక్కించుకోవాల్సింది 1 వికెట్. ఐదు బంతులు వేసిన వికెట్ దక్కలేదు. 800 వికెట్ అసాధ్యం అనుకొన్నారు. కానీ ముత్తయ్య మురళీధరన్ తన అనుభవాన్ని రంగరించి చివరి బంతిని బ్రహ్మస్త్రంగా వదిలాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లో భారతీయ ఆటగాడు ప్రగ్నాన్ ఓజా. ముత్తయ్య బంతిని విసిరాడు. ఓజా బంతిని స్లిప్‌లోకి ఆడాడు. అప్పటికే స్లిప్‌లో ఉన్న మహిళా జయవర్ధనే అద్బుతంగా క్యాచ్‌ను అందుకొన్నాడు. దాంతో చరిత్ర పుటల్లోకి ముత్తయ్య మురళీధరన్ పేరు చిరస్మరణీయమైంది. 800 వికెట్ ముత్తయ్యే కాదు.. క్రికెట్ అభిమానుల స్మృతిపథంలో చెరగని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రికార్డును టచ్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు.

మురళీధరన్ జీవిత కథ రిలీజ్ ఎప్పుడంటే? :ఇలాంటి ఎన్నో ఉద్వేగ భరితమైన సంఘటనలు, భావోద్వేగమైన క్షణాలతో తెరకెక్కిన చిత్రం 800. ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిత్రాన్ని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











