Gangavva: కూలీ నుంచి వెండితెర వరకు.. మహిళలకు గంగవ్వనే ఆదర్శమవ్వదా?
గంగవ్వ.... పేరు వినగానే పల్లెతనం, కల్మషంలేని మనస్సు, ఆత్మీయత, అనురాగం వంటివి గుర్తుకు వస్తుంటాయి. పాపులర్ యూట్యూబ్ ఛానెల్ 'మై విలేజ్ షో' ద్వారా ఈ ఆణిముత్యం ప్రపంచానికి పరిచయం అయ్యింది. చదువు లేకున్నా.. ఎలాంటి నటనా స్కిల్స్ లో సర్టిఫికెట్స్ లో లేకున్నా.. నేచురల్ టాలెంట్ తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. వయస్సు మీద పడినా సోసైటీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనకడు వేయలేదు. యువకుల ప్రోత్సాహం, తన నిజమైన వ్యక్తిత్వాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా వ్యక్తం చేస్తూ మొదట పల్లె ప్రజల ప్రశంసలు అందుకుంది. అలా మొదలై అంచెలంచెలుగా ఎదిగింది. విమెన్స్ డే 2025 స్పెషల్స్ సందర్భంగా.. మన గంగవ్వ నిజ జీవిత విజయగాథను తెలుసుకోవాల్సిందే...
కుటుంబ నేపథ్యం...
ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని లాంబాడిపల్లిలో నివసిస్తున్న గంగవ్వ 1961లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 62 ఏళ్లు. పెద్ద చదువుకోని గంగవ్వ పల్లె పాఠాలను మాత్రం నేర్చుకుంది. స్వచ్ఛమైన మనస్సు, సాయం చేసే గుణం, ముక్కుసూటితనం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వం, ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వం, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం.. ఇవన్నీ గంగవ్వకున్న ప్రత్యేక లక్షణాలు. ఆమెకు చిన్న వయస్సులోనే వివాహామైంది. ఆమెకు మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఒక కూతురు దురదృష్టవశాత్తు చనిపోవడం బాధాకరం.

కూలిగా మొదలై...
పెళ్లైన తర్వాత గంగవ్వ పల్లెలోనే జీవనం సాగించింది. భర్త, పిల్లలను చక్కగా చూసుకుంటూ పొలం పనులకు వెళ్తూ ఉండేది. పుట్టినిట్టివారు.. మెట్టినింటివారు పొలం పనులే చేస్తుండటంతో అందులో మాత్రం ఆరితేరింది. వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనం సాగించేంది. అలా తన యాబై ఏళ్ల జీవితాన్ని కూలిగానే కొనసాగించింది. మరోవైపు బీడీ చుడుతూ కష్టాలను దాటింది. భర్త, కూతురు చనిపోవడం, మరోవైపు ఆర్థిక సమస్యలతో ఎంతో సతమతమైంది. ఎన్నో కష్టాలను ఓర్చుకుని బతుకు జట్కా బండిని లాగింది.
యూట్యూబ్ సెన్సేషన్ గా...
లంబాడి పల్లెకు చెందిన శ్రీకాంత్ (శ్రీరామ్) 2016 వరకే బీటెక్ పూర్తి చేశాడు. టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆయన 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. పెద్ద గా ఫేమ్ సంపాదించాలని కాకుండా.. తన ఊరి వాతావరణాన్ని, విచిత్రమైన సంఘటనలను, స్వచ్చమైన వారి ప్రేమను, పల్లె మనుషులను, కామెడీ సన్నివేశాలను, తెలంగాణ యాస, భాషను చూపించేందుకు ఛానెల్ స్టార్ చేశాడు. తొలుత ఒక వీడియోను గంగవ్వతో చిత్రీకరించి రిలీజ్ చేశారు. నటనపై ఎలాంటి అనుభవం లేకున్నా.. కంటెంట్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ ను పలికించడంలో సక్సెస్ అయ్యింది. దాంతో గంగవ్వ అతి తక్కువ కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత 'మై విలేజ్ షో' చిత్రీకరించిన వీడియోలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
టీవీ షోస్, బిగ్ బాస్ రియాలిటీ షో ఎంట్రీ..
గంగవ్వ యూనిక్ డిక్షన్, తెలంగాణ మాండలికంలో ఆరితేరింది. మరింతగా అందులో పట్టుసాధించడంతో స్టేట్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది. దీంతో సెలబ్రెటీగా మారిపోయింది. ఐదు పదుల వయస్సు దాటక ఆమెకంటూ ప్రత్యేక గౌరవం లభిచింది. యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిన తర్వాత నెమ్మదిగా సినిమాలు, టీవీ షోల్లో గెస్ట్ అపీయరెన్స్ గా ఆహ్వానం అందుకుంది. 'సిక్త్స్ సెన్స్ సీజన్ 3, 4', బిగ్ బాస్ సీజన్ 4, 8 షోల్లో సందడి చేసింది. దాంతో యూట్యూబ్ సెన్సేషన్ టీవీ ఆడియెన్స్ కు స్టార్ గా మారిపోయింది. బిగ్ బాగ్ తర్వాత నేషన్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.

సినిమాలు...
యూట్యూబ్, స్మాల్ స్క్రీన్ పైనే కాదు.. గంగవ్వ బిగ్ స్క్రీన్ పైనా తన యాస, భాషతో అదరగొట్టింది. తొలుత ప్రియదర్శి 'మల్లేశం' చిత్రంలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'ఇస్మార్ట్ శంకర్'లోనూ గెస్ట్ అపీయరెన్స్ ఇచ్చి థియేటర్లలో సందడి చేయించింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, లవ్ స్టోరీ, మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', ఇంటింటి రామాయణం, స్వాగ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లోనూ మెరిసింది.
అవార్డ్స్...
కూలిగా మొదలై యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన గంగవ్వ జీవితం ఎంతో మందిని ఆలోచింపజేసింది. మహిళా లోకానికి ఆమె లైఫ్ పాఠంగా మారింది. ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2020లో గంగవ్వకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా 'విమెన్ ఆచీవర్ అవార్డ్'ను సొంతం చేసుకుంది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది. గంగవ్వకు సక్సెస్ స్టోరీకి శ్రీకాంత్, యూట్యూబ్ సెన్సేషన్, ఇన్ ఫ్లూయేన్సర్ అనిల్ జీలా ఎంతో కృషి చేశారు. పల్లెటూరి ఆణిముత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.


Click it and Unblock the Notifications











