లిటిల్ జూనియర్ ఎన్టీఆర్‌కి ఏడాది.. వైరల్ అవుతున్న తారక్ చిన్నకొడుకు పిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లంతా ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ కొడుకుపై పడ్డారు. ఇంతకీ విషయమేంటి అంటారా? అదేనండీ నేడు (జూన్ 14) తారక రాముడి చిన్నకొడుకు భార్గవ్ రామ్ మొదటి పుట్టిన రోజు. గతేడాది సరిగ్గా ఇదే రోజు జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మి ప్రణతి దంపతులకు రెండో సంతానం కలిగింది.
అప్పటికే వారి పెద్ద కొడుకుకి అభయ్ రామ్ అనే పేరు పెట్టిన ఎన్టీఆర్ దంపతులు రెండో సంతానానికి కూడా రాముడి పేరు కలిసే విధంగా భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు. అచ్చం తాత హరికృష్ణ పోలికలతో ఉన్న ఈ చిన్ని రాముడి మొదటి పుట్టిన రోజు ఈ రోజు. దీంతో తండ్రిగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భార్గవ్ రామ్ తో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు ఎన్టీఆర్. ఈ ఫొటోల్లో తన చిన్న కుమారుడిని చూసి పరవశించి పోతున్నట్లుగా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. దీంతో తండ్రీ కొడుకుల ఆప్యాయత చూసి మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. అలాగే సోషల్ మీడియా వేదికగా భార్గవ్ రామ్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా సంగతుల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే చేతికి అయిన గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై చురుకుగా కదులుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. చిత్రంలో మరో హీరో రామ్ చరణ్ సరసన ఇప్పటికే ఆలియా భట్‌ని కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











