పక్కా లోకల్.. అక్కడ కూడా అదే.. ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఇదే మరి!!
మనోడు పేరుకే జూనియర్ ఎన్టీఆర్.. కానీ సీనియర్లను మించిన క్రేజ్ ఈ యంగ్ టైగర్ సొంతం. సినిమా సినిమాకు పరిణితి చెందుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్.. అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే ఎన్టీఆర్ పాపులారిటీయే వేరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఓ పండగ వాతావరణం నెలకొనే పరిస్థితులు చూశాం. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ దేశ సరిహద్దులు కూడా దాటేసింది. విదేశాల్లోని జనాలను ఎన్టీఆర్ పాట హుషారెత్తించడంతో సదరు వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహిళల ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మార్చి 8న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ పాట ప్లే చేసి స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్, కాజల్ రెచ్చిపోయి చిందేసిన ''పక్కా లోకల్'' సాంగ్ ప్లే చేశారు. అయితే ఆ మ్యాచ్ చూస్తున్న ఓ క్రీడాభిమాని ఆ పాటను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఇది చూసిన 'జనతా గ్యారేజ్' సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సైతం లైక్ కొట్టడంతో ఈ వార్త మీడియా వర్గాల చేతికి చిక్కింది. ఇది చూసిన నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఇదే మరి!! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











